నిన్నటి వరకు ముఖ్యమంత్రి గత కాలపు సన్నిహితుడు స్నేహితుడు ఇప్పటి టిఆరెస్ నాయకుడు విజయరామారావు కుమారుడు శ్రీనివస్ కళ్యాణ్ రావు గ్రూప్ పై జరిగిన దాడుల తీగలాగితే అక్కడెక్కడో ఉన్న సుజనా చౌదరి కి చెందిన సుజానా గౄఉప్ డొంక కదలగా - అక్కడి తీగ ఇప్పుడు సిఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రోజెక్ట్స్ మూలాలో ముసలం పుడుతుంది. 
Image result for IT raids on cm ramesh houses and properties
టీడీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, ముఖ్యమంత్రి పోరుగున నివసించే అతి సన్నిహిత మిత్రుడు సీఎం రమేశ్‌ నివాసాలు, వ్యాపార కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు నేడు (శుక్రవారం) తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌, విజయవాడలో ఏకకాలం‍లో 60 మందికి పైగా ఆదాయపన్ను శాఖ అధికారుల ఆద్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 
Image result for IT raids on cm ramesh houses and properties
ఆయన స్వగ్రామం వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి లోని నివాసం లోనూ సోదాలు విస్తారంగా జరుగుతున్నాయి. ఐటి రిటర్న్స్ లో ఆయన చూపించిన ఆదాయానికి, అసలు కనిపించే లెక్కలకు ఎలాంటి పొంతన లేకపోవడంతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. విరివిగా దొరుకుతున్న ఆస్తుల పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు.
Image result for beeda ravichandra beeda mastan rao
ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ అధికారం లోకి వచ్చాక సీఎం రమేష్ ప్రభుత్వం నుండి పలు కాంట్రాక్టు దక్కించు కున్నారు. వేరెవరికీ కాంట్రాక్టులు దక్కకుండా ఆయనకే అన్ని కాంట్రాక్టులు ఇస్తున్నారని టీడీపీ నాయకులే అనేక సందర్భాల్లో బహిరంగంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం సీఎం రమేష్ ఢిల్లీలో ఉన్నారు.
Image result for CM Ramesh Bida Mastan Rao
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సోదరుడు బీద మస్తాన్‌ రావు ఇల్లు, వ్యాపార సంస్థలపై కూడా ఆదాయ పన్నుల శాఖ అధికారులు గతవారం దాడు లు నిర్వహించారు. "బీఎంఆర్‌ - బీద మస్తాన్ రావు" గ్రూప్‌ పేరుతో వ్యాపారాలు చేస్తున్న ఆయన ఆదాయపన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. వరుస దాడులు అధికార టీడీపీ నాయకుల్లో గుబులు రేపటమేకాదు గుండెల్లో భూకంపాలు సృష్టిస్తున్నారు. తాము చేసిన అక్రమాలు ఎక్కడ బయట పడతాయోనని ఈ పచ్చ పార్టీ నేతలు వణికిపోతున్నారు. 
Image result for CM Ramesh Bida Mastan Rao

అతి స్వల్ప కాలంలోనే ఆక్వారంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకుడు, రాజధాని నిర్మాణ కమిటీ సభ్యుడు, టిడిపి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సోదరుడు  బీద మస్తాన్‌ రావు ఇల్లు, వ్యాపారసంస్థలపై ఒక్క సారిగా ఆదాయ పన్నుల శాఖ అధికారులు నిన్న (గురువారం) ఆకస్మిక దాడుల్లో అనేక కొత్త విషయాలు బయటపడుతున్నట్లు తెలుస్తుంది. తమిల రాజధాని చెన్నైలోని ఆయన నివాస గృహం, కార్పొరేట్‌ కార్యాలయం, నెల్లూరులోని కార్యాలయం, కావలి సమీపంలో విమానాశ్రయ భూముల వద్ద ఉన్న దామవరం రొయ్యల మేత ఫ్యాక్టరీ,  రొయ్యలు విదేశాలకు ఎగుమతి చేసే ప్రాసెసింగ్‌ ప్లాంట్లపై ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. అక్కడ కదలిన పున్నాదుల పగుళ్ళు సిఎం రమేష్ గృహ తీరం చేర్చినట్లు తెలుస్తుంది. 
Image result for beeda ravichandra beeda mastan rao
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా అల్లూరు మండలం ఇసకపల్లి గ్రామానికి చెందిన బీద మస్తాన్‌ రావు రొయ్యపిల్లల గుంతల వద్ద చిన్నగుమస్తాగా జీవితాన్ని ప్రారంభించి, అంతర్జాతీయ స్థాయి రొయ్యల ఎగుమతిదారుడిగా ఎదిగారు. చెన్నై, పాండిచ్చేరి, వైజాగ్‌ తో పాటు నెల్లూరుజిల్లాలో విడవలూరు మండలం రామతీర్థం, అల్లూరు మండలం ఇసకపల్లిలో ఉన్న రొయ్యపిల్లల ఉత్పత్తి (హేచరీస్‌) కేంద్రాల ద్వారా ఏడాదికి 250 మిలియన్ల రొయ్య పిల్లలను విక్రయిస్తుంటారు. వీటి అమ్మకాల ద్వారా ఏడాదికి ₹ 1500 కోట్ల వ్యాపారం చేస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు.
Image result for beeda ravichandra beeda mastan rao
రొయ్య పిల్లలు అమ్మకాలు చేసే ప్రక్రియకు బిల్లులు ఉండవు. అలాగే బీద మస్తాన్‌రావు ఇసకపల్లిలో వందలాది ఎకరాల్లో రొయ్యల చెరువులు సాగు చేస్తుంటారు. ఆక్వా రైతు ల నుంచి కొనుగోలు చేసిన రొయ్యలతో పాటు, తన సొంత చెరువుల ద్వారా సాగుచేసిన రొయ్యలను దామవరంలో ఉన్న ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ నుంచి వివిధ దశల్లో శుభ్రపరచి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అలాగే దామవరంలోని రొయ్యలు మేత ఫ్యాక్టరీ నుంచి వేల టన్నుల రొయ్యల మేత రాష్ట్రంలోని కోస్తా జిల్లాల మార్కెట్‌కు తరలిస్తారు.

Image result for beeda ravichandra beeda mastan rao

మరింత సమాచారం తెలుసుకోండి: