నాటి మహిశారుని పాలనను గుర్తు చేసేలా నేటి  చంద్రబాబు నారాసుర  పాలన సాగుతోందని వైసీపీ అధినేత జగన్ మాటల తూటాలు పేల్చారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో వారిపైనే దాడులు చేస్తూ అవినీతి పాలన చేస్తున్నారని జగన్ ద్వజమెత్తారు. ఈ పాలనకు జనమే చరమగీతం పాడాలంటూ పిలుపు ఇచ్చారు. బొబ్బిలిలో జగన్ బహిరంగ సభ అదిరిపోయే రేంజిలో సాగింది.


అడుగుపెడితే చీకటే:


బాబు పాలనలో కరవు, తప్పితే తుపానులు, సునామీలేనని జగన్ ఎద్దేవా చేశారు. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ చీకటే తప్ప వెలుగు ఉండదని అన్నారు. బాబు అక్రమాలు తారస్థాయికి చేరిపోయాయని హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఏ గడ్డి అయినా తినడానికి వెనకాడని వ్యక్తి. ఏపార్టీతోనైనా పొత్తు పెట్టుకోవడానికి సిగ్గు పడడు అంటూ ఫైర్ అయ్యారు. ఏ వ్యవస్థను మేనేజ్‌ చేయడానికైనా ఏమాత్రం మొహమాటపడడు. ఎన్ని వందల అబద్ధాలనైనా ఆడతాడు. ఎన్ని వందల అబద్ధపు హమీలైనా ఇచ్చి అధికారాన్ని మాత్రం వదులుకునేందుకు ఇష్టపడడు ఈ నారాసురుడు అంటూ అటాక్ చేశారు.


నీతి తప్పిన రాజు :


శాసనసభలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు 23 మందిని సంతలో పశువుల్లా కొనుగోలు చేసి రాజ్యాంగానికి తూట్లు పొడిచారని జగన్ ఆరోపించారు. అందులో బొబ్బిలి రాజు కూడా ఉన్నారని, ఈ రాజు గారు నీతి తప్పారని సుజయక్రిష్ణ రంగారావుపై విమర్శలు సంధించారు. విలువల కోసం ప్రాణాలు అర్పించిన తాండ్రపాపారాయుడు బతికిన బొబ్బిలి గడ్డపైనే ఈ రాజు నీతి తప్పి వ్యవహరించారని స్థానిక ఎమ్మెల్యేనుద్దేశించి ధ్వజమెత్తారు


నారాసుర మోసాలివే :


అక్కా చెల్లెమ్మలకు ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లో ఉన్న 14,206 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తానని చెప్పి ఎగ్గొట్టిన ఘనత ఈ నారాసురుడిది అంటూ బాబుపై జగన్ మండిపడ్డారు.  మహిళా సంఘాలపై బ్యాంకు సిబ్బంది వచ్చి దాడులు చేస్తున్న పరిస్థితి. మహిళలను కోర్టు మెట్లు ఎక్కిస్తున్న పరిస్థితి. ఇదే నారాసురుడు ప్రతి అక్కచెల్లెమ్మకు రూ. పది వేలు ఇస్తామని ప్రచారం చేసుకుంటున్నాడు. మళ్లీ అదే పది వేలను అప్పుగా బ్యాంకుల చేత ఇప్పిస్తూ దానికొక పేరు పెట్టాడు

 దానికి పసుపు కుంకుమ అంటూ పధకం పేరిట హడావుడి చేస్తున్నారని జగన్ విమర్శించారు. బొబ్బిలి మీటింగుకు జానం పోటెత్తారు. బొబ్బిలి రాజుల ఇలాకాలోనే భారీగా జనం తరలిరావడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: