Related image
ఇంతవరకు కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ పై దాని ముఖ్యమంత్రి చంద్రబాబు పై కక్ష గట్టిందనే ప్రచారంతో బ్రేకింగ్ న్యూస్ ఇస్తూ కాలం గడిపిన ఏపి ప్రభుత్వ మద్దతు మీడియా సిఎం రమేష్ గుట్టుమట్లన్నీ ఐటి శోదాలతో రత్తై బట్టాబయలు కావటం, తొలినుంచీ ఆ విషయాలను కప్పేసి గోబెల్ పద్దతిలో సిఎం రమేష్ నేఱాలను తన భుజస్కందాలపై మోస్తూవస్తున్న సమయంలో జాతీయ ఆంగ్ల మీడియా ప్రమేశం ఈ ప్రాంతీయ పచ్చ మీడియా గొంతులో పచ్చి వెలక్కాయ పడేసినట్లైంది. 
Image result for CM Ramesh corruption & National media
అదే ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు టీడీపీ రాజ్యసభ సభ్యుడు కూడా అయిన సీఎం రమేశ్‌ అక్రమలావాదేవీలు, బినామీ వ్యవహారాల గుట్టు ఆదాయ పన్నుశాఖ బట్టబయలు చేసింది. సబ్‌-కాంట్రాక్టుల ముసుగేసుకొని చేయని పనులు చేసినట్లుగా చేయకూడని తప్పులెక్ఖలు చూపి బిల్లులు పెట్టి ప్రభుత్వం నుండి దగా అమౌంట్స్ డ్రా చేసి తన "షెల్ కంపెనీ" ల ఖాతా ల్లోకి మళ్లించి వాటి నుంచి తిరిగి  సీఎం రమేష్ స్వంత సంస్థ ల్లోకి వెనక్కి తీసుకున్నట్లు ఐటీ అధికారులకు ఖచ్చితమైన ఆధారాలు దొరికాయి.
Image result for cbn cm ramesh sujana revanth
ఇటీవల జరిగిన సోదాల్లో దాదాపుగా ₹100 కోట్ల వరకు దారి మళ్ళించినట్టు గుర్తించారు. అయితే ఆ ₹100 కోట్ల కోసం తవ్వుతుంటే అందులోనుండి పాపాల కాలనాగులు బుసగొడుతూ ₹ 700 కోట్లకు అనుమానాస్పద లావాదేవీలు బయటపడినట్లు అధికారులు కనుగొన్నారని సమాచారం. అదింకా దృవీకరించవలసి ఉంది.  షెల్ కంపెనీ ల ద్వారా ₹100 కోట్ల రూపాయలను దారిమళ్ళించారు అనటానికి పక్కా ఆధారాలు లభించాయి. ఈ లావాదేవీల‌కు సంబంధించి లెక్క‌లు ఆ కంపనీ అకౌంటెంట్ సాయిబాబా ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారు.
Image result for IT raids on CM Ramesh
ఇక ఈ డబ్బు మొత్తం టిడిపిలోని ఒక కీలక యువనేతకు చెందిన ఇంధన తయారీ కంపెనీలోకి చేరిందన్నది అనుమానం. ఫచ్చ టివి చానళ్ళ సాక్షిగా సిఎం రమేష్ మీసం మెలేస్తూ బిజెపి పార్లమెంట్ సభ్యుడు నరసింహారావును బెదిరించిన తీరు తెలుగు జాతి మొత్తం కనులారా వీక్షిస్తూ కలవరపడింది. ఆ చానల్ వ్యాఖ్యాత కూడా ఘట్టిగా ఆ రౌడీతనాన్ని నిరోదించలేదు.
Image result for IT raids on CM Ramesh
ఇంతవరకు బిజెపి ఏపికి అన్యాయం చేస్తూ కక్ష గట్టిందనేదానికి ఈ ఐటి సోదాలు తెరవేసేశాయి అంటున్నారు. ఒక్కసారిగా క్రమ్మిన మబ్బులు విడిపోయి నట్లు, ఐటి సోదాలతో టిడిపి అవినీతిపరులైన రెవంత్ రెడ్డి, బీద మస్తాన్ రావు, సుజానా చౌదరి చివరికి తెలుగుదేశం ఖజానా సిఎం రమేష్ ల పాపం వైతురుణిలా రోడ్లపై ప్రవహిస్తుంటే, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరుఅన్న సామెతగా పాపాలతో క్రిక్కిరిసిన అవినీతి పుట్టల్ని మూసేయ్యటం పచ్చ మీడియా తరం కాదనేది, పుట్టలు పగిలితే గాని కాలసర్పాలు బయటకు రావనేది కళ్లకు కట్టినట్లు ఋజువైంది. 
Image result for IT raids on CM Ramesh
తెలుగు దేశం పార్టీకి కేంద్రం అడిగినంత సొమ్ము విడుదల చెస్తే ప్రస్తుతానికి బలిసి పోయేది వారి రాజ్యసభ సభ్యులు, గుత్తెదార్లు, అనుయాయులు, ఇతర ప్రజాప్రతినిధులు తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం జరగదనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన కావచ్చేమో? సిఎం రమెష్ ఈ అవినీతి సొమ్మంతా ఏ మహా నాయకుని మహాంధకార పాప కాసారంలోకి  చేరుతుందో ఇక తెలియవలసి ఉంది. 
Image result for IT raids on CM Ramesh
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డబ్బు చెల్లింపు వ్యవహారంలో కూడా సీఎం రమేష్‌ పాత్ర ఉన్నట్లు ఐటీ సోదాలలో తెలియ వచ్చింది. వైకాపా నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రలోభం ఖాతా ద్వారా అందజేసిన సొమ్ములో కొంత సొమ్ము సీఎం రమేష్‌ కంపెనీల ద్వారా బట్వాడా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆధారాలు పక్కా కాగా ఉండటంతో సీఎం రమేష్ ను అరెస్ట్ చేయడం తప్ప వేరే దారి లేదనే ప్రచారం కొనసాగుతుంది. 
Related image
ఐటీ దాడుల్లో అధికారులు గుర్తించిన అవకతవకల గురించి ఒక ఇంగ్లిష్ దినపత్రిక ఆసక్తిదాయక మైన సమాచారాన్ని ఇచ్చింది. దాని ప్రకారం, సీఎం రమేష్ ఇళ్లపై జరిపిన ఐటీ దాడుల్లో వంద కోట్ల రూపాయల వరకూ సొమ్ములు దారిమళ్ళించిన లావాదేవీలను ఐటీ అధికారులు గుర్తించి నట్లు పేర్కొనడం అందులో రిత్విక్ ప్రాజెక్ట్స్ ద్వారానే ₹74 కోట్ల రూపాయల సొమ్ములు అను మానాస్పద కంపెనీలకు మళ్లించిందని ఆ పత్రిక పేర్కొంది.  ఇప్పటికే గుర్తించలేని లావాదేవీలు ఇవి అని పేర్కొందట ఐటీ శాఖ.
Related image
ఒక  అకౌంటాంట్ లెక్కలు రాయటానికి శక్తి చాలలేదన్నంత సొమ్ము నగదు రూపంలో కంపనీలో  అకౌంట్ చేయని నగదు సొమ్ము పిచ్చిపిచ్చిగా దారి మళ్ళిందట. కష్టార్జితానికి లెక్కలు పక్కాగా దొరుకుతాయి అవినీతి వెల్లువైనప్పుడు లెక్కలకే తిలోదకాలు తప్పదన్న బావన అంతటా వినిపిస్తుంది.
Image result for IT raids on CM Ramesh
ఈ మేరకు ఐటీ శాఖ నుంచి సమా చారం అందినట్టుగా ఆ పత్రిక పేర్కొంది. ఈ సోదాల్లో కొన్ని కీలక పత్రాలను ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలు స్తోంది. తన ఇంటి నుంచి వారు చిన్న  కాగితం ముక్క కూడా తీసుకెళ్లలేదని సిఎం రమేష్ పేర్కొన్నాడు. అయితే, వాస్తవంగా మాత్రం కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. 
Image result for IT raids on CM Ramesh
వంద కోట్ల రూపాయలకు విలువైన అనుమానాస్పద లావాదేవీలను అధికారులు గుర్తించారు అని జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు, అసలు కథలు ఏమిటనేది ముందు ముందు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే జాతీయ మీడియా ఢిల్లీ నుంచి ఈ మేరకు సమాచారాన్ని ఇస్తోంది.
Image result for IT raids on CM Ramesh
అవినీతి చెలియలి కట్ట తెగిపోవటంతో వెల్లువెత్తే వరదకు ప్రాంతీయ పచ్చ మీడియా అడ్డుకట్ట వేయలేకపోతుందనే సమాచారం. అందుకే పాపం పండాలని అంటారు. దీన్నిబట్టి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు, ఈ పచ్చ మీడియా వారికి కాపు కాయటం మాననంతవరకు, బాహుశ ఈ రాష్ట్రం బ్రతుకింతేనేమో?  

Image result for IT raids on CM Ramesh

మరింత సమాచారం తెలుసుకోండి: