భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎంతో సంతోషంతో జరుపుకునే పండుగ దీపావళి.  దీపావళి పండుగ ఇంటికి దీప కాంతులు తీసుకొస్తుంది. పిల్లలందరూ కేరింతలు కొడుతూ సరదాగా సందడి చేస్తుంటారు. వాళ్లని చూసి పెద్దలు మురిసిపోతుంటారు. కానీ ఆ రోజు కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకుంటే పండగ వాతావరణం పాడవకుండా ఉంటుంది. దీపాలు వెలిగించి ఇంటి ముంగిట పెట్టేటప్పుడు డోర్ కర్టెన్లకు దూరంగా ఉంచాలి. లేదంటే అవి అంటుకునే ప్రమాదం ఉంటుంది. దీపావళి రోజు చాలా మంది కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటారు.  

Image result for diwali fires

దీపావళి నాడు పగలంతా పిండివంటలు, పూజలతో గడిచిపోతుంది. సాయంత్రం వేళ అసలైన సందడి కనిపిస్తుంది. చిన్న పిల్లలు నుంచి పెద్ద వాళ్ల వరకు టపాసులు కాల్చడంలో లీనమైపోతారు. మార్కెట్ లో దొరికే రకరకాల టపాసులతో హుషారుగా సంబరం చేసుకుంటారు. కానీ దివ్వెల దీపావళి చేదు జ్ఞాపకం కాకూడదంటే తప్పని సరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. దీపావళి అంటేనే పటాకుల సందడి..రక రకాల పటాలకులు కాల్చాలని పిల్లలు ఉత్సాహ పడుతుంటారు.  అయితే పిల్లలకు చేతులు కాళ్లు పూర్తిగా కవర్ అయ్యేలా కాటన్ బట్టలు వెయ్యాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ సిల్క్ గానీ పాలిస్టర్ దుస్తులు కానీ వేసుకోకూడదు.

Image result for diwali fires

ఒకవేళ దుస్తులపై నిప్పు రవ్వలు పడి అవి రాజుకొని మంటలు వ్యాపిస్తే వెంటనే ఒంటిపై దుప్పట్లు లేదా రగ్గులను కప్పి మంటలను నిరోధించాలి.  చుట్టు పక్కల గుడెసులు ఉంటే... వాటి పైన నిప్పురవ్వలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాకెట్ల లాంటివి కాల్చుతున్నప్పుడు గుడెసలకు దూరంగా కాల్చాలి. ఫైర్ సర్వీసెస్ ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంచుకుంటే మంచిది. టపాసులు కాల్చేటప్పుడు ముందు జాగ్రత్తగా బర్నాల్, దూది, టించర్, డెటాల్ వంటివి దగ్గర పెట్టుకోవాలి. ప్రమాదవశాత్తు చేతులు కాలితే.. వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయాలి. లక్ష్మీ బాంబులు, సీమ టపాసులు కాల్చేటప్పుడు.. దూరంగా ఉండి అంటించాలి.

Image result for diwali fires

అగ్గిపుల్లతో కాకుండా పొడవాటి కాకరపువ్వొత్తులు దొరుకుతాయి. వాటితో అంటిస్తే మంచింది. సీమటపాసులు కాల్చేటప్పుడు ముఖ్యంగా 1000వాలా, 10,000వాలా సీరీస్ కాల్చేటప్పుడు జన సమర్థం లేకుండా చూసుకోవాలి. ఆ దారి గుండా వచ్చే వాళ్లని గమనించాలి. అంతే కాదు భూ చక్రాలు కాల్చాలనుకునే వాళ్లు కచ్చితంగా పాదరక్షలు ధరించాలి. ఆ సమయంలో పాకే పసికందులను నేలపై ఉంచకండి. దీపావళి సామాగ్రికి సమీపంలో దీపం, కొవ్వొత్తులు, అగరవొత్తులు ఉంచకూడదు. వెలిగి పేలకుండా ఆరిపోయిన చిచ్చుబడ్లు లేదా బాంబుల వద్దకు వెళ్లి పరిశీలించకూడదు. మళ్లీ వాటిని వెలిగించే ప్రయత్నం చేయడం అత్యంత ప్రమాదకరం. చిచ్చుబడ్లు వగైరా వెలిగించేటప్పుడు మొహం దగ్గరగా పెట్టకుండా చూసుకోవాలి. వాహనాలకు దగ్గరలో టపాసులు కాల్చొద్దు. 

మరింత సమాచారం తెలుసుకోండి: