ఇరవై మూడు జిల్లాలతో అలరారిన నిండు కుండ లాంటి  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సరిగ్గా నాలుగేళ్ళ క్రితం రెండు ముక్కలైంది. చితికిన ముక్కతో పడుతూ లేస్తూ నవ్యాంధ్ర కొట్టుమిట్టాడుతోంది. విభజన ఏపీలో రాజకీయమే తప్ప అభివ్రుధ్ధి ఎక్కడా కానరాని దుస్థితి ఉంది. చూస్తూండనే తొట్ట తొలి పాలన పూర్తి అయి మళ్ళీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ కొత్త ఆలొచనలు పుట్టుకొస్తున్నాయి.


మరో ముక్కకు రెడీనా:


నవ్యాంధ్ర  రెండు ముక్కలు అయ్యే రోజులు ఎంతో దూరం లేవా. ఇపుడున్న పదమూడు జిల్లాల ఏపీని సగానికి సగం విడగొట్టడానికి రాజకీయం కాచుకుకూర్చుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. నవ్యాంధ్రన విషపు బీజాలు నాటేందుకు నాయకులు తయారుగానే ఉన్నారు. ఇపుడు ప్రజలు  ఏమంటారన్న దానిపైననే ఏపీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.


మైసూరా ఘాటు కామెంట్స్:


కడపలో తాజాగా జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో మాజీ మంత్రి, సీమ నాయకుడు ఎంవీ మైసూరారెడ్డి రాయలసీమ రాష్ట్రం కోసం ప్రాణత్యాగమే చేస్తానంటూ ఘాటు కామెంట్స్ చేశారు. విభజన తరువాత వంచనకు రాయలసీమ గురి అయిందని ఆయన అన్నారు. నీటి ప్రాజెక్టుల నుంచి అభివ్రుధ్ధి వరకూ అంతటా అన్యాయమే జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. సీమ ప్రజలు విభజన వల్ల దారుణంగా నష్టపోయారని కూడా అన్నారు. దీనికి సరైన పరిష్కారం రాయలసీమ రాష్ట్రమేనని ఆయన అన్నారు.


బీజం వేసిన బీజేపీ :


చాలాకాలం క్రితమే బీజేపీ దీనికి బీజం వేసింది. రాయలసీమ డిక్లరేషన్ పేరుతో ఆ పార్టీ చేసిన హడావుడి వెనక అసలు కధ ఇదే. ఇక. సీమ ప్రాంత నాయకులు చాలాకాలంగా హైకోర్టు అయినా తమ ప్రాంతంలో పెట్టాలని కోరుతూ వస్తున్నారు. శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం నిజానికి రాజధాని అక్కడ ఉండాలి. కానీ అది కోస్తాకు ఇచ్చినందువల్ల హైకోర్టు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విభజనతో అభివ్రుధ్ధి అంతా అమరావతి కేంద్రంగా సాగుతోందన్న ఆరోపణలు కూడా చాలాకాలంగా ఉన్నాయి.


ఇలాగే సాగితే తప్పదేమో:


ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ పూర్వం మాదిరిగా ప్రగతి అంతా ఒక్క చోటనే పోగు చేస్తోంది. కేంద్రీకరణ విధానాల వల్లనే నాడు ఉమ్మడి ఏపీలో అనేక ప్రాంతాలు వెనకబడ్డాయి. ఇపుడు అదే తీరు వల్లనే సీమ వాసులు వివక్షకు గురి అవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. రేపటి రోజున ఇది మరింతగా బలపడి ఉధ్యమం  ఊపందుకుంటే ఏపీకి మరో పెను గండం తప్పదు. ఇప్పటికైన సీమ వాసుల కోరిక మేరకు హైకోర్టును అక్కడ ఏర్పాటు చేసి. రెండవ రాజధానిగా రాయల‌సీమను ప్రకటిస్తే ఈ ముక్కలు అయ్యే ముప్పును నివారించవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: