ఏ ఎమ్మెల్యే అయినా.. పార్టీని అభివృద్ది చేయ‌డానికి, పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డానికి ఎంతో తాప‌త్ర‌య ప‌డుతుం టారు. అయితే, నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి ఎమ్మెల్యే మాత్రం పార్టీని భ్ర‌ష్టుప‌ట్టిస్తున్నారు. 2014  ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్‌పై ఇక్క‌డ నుంచి బొల్లినేని వెంక‌ట రామారావు పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డిపై కేవ‌లం 3000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజ‌యం సాధించారు. అయితే, దీనికి ముందు 2012లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో తొలిసారి బొల్లినేని పోటీ చేసినా.. ఘోరంగాఓడిపోయారు. వాస్త‌వానికి ఉద‌య‌గిరిలో దాదాపు 15 ఏళ్లుగా మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి ఫ్యామిలీ చ‌క్రం తిప్పుతోంది. అయితే, 2014లో మాత్రం ఈ ఫ్యామిలీ హ‌వాకు టీడీపీ బ్రేక్ ఇచ్చింది. 

bollineni ramarao కోసం చిత్ర ఫలితం

త‌క్కువ మెజారిటీతోనే గెలిచినా.. బొల్లినేని.. పార్టీని అభివృద్ధి చేస్తార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇక్క‌డ టీడీపీ సైకిల్‌ను పరుగులు పెట్టిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని ప‌ట్టించుకోక‌పోగా.. కార్య‌క‌ర్త‌ల కు కూడా అందుబాటులో లేకుండా పోయారు. వ్యాపార లావాదేవీలతో బెంగుళూరుకే పరిమితం అవుతూ, మండలస్థాయి, గ్రామస్థాయి నాయకులను లెక్కచేయకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఫిర్యాదులు ఇప్ప‌టికే టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌ర‌కు కూడా వెళ్లాయి. అయినాకూడా బొల్లినేని లెక్క‌చేయ‌డం లేదు. దీంతో ఇక్క‌డ టీడీపీని న‌డిపించే నాయ‌కుడు కూడా క‌రువ‌య్యార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. 


అంతేకాకుండా.. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను కూడా రామారావు ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ల‌డం లేదు. వాస్త‌వానికి ఆయ‌న‌కు ప్ర‌బుత్వం ప్ర‌వేశ పెడుతున్న ప‌థ‌కాల‌పై కూడా ప‌ట్టులేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇటీవల ఎమ్మెల్యే రామారావు ఒక గ్రామంలో పర్యటించడానికి వెళ్లినప్పుడు ఇక నీవు గ్రామాల్లో తిరగలేవు.. ఎక్కడైనా వ్యాపారాలు చేసుకో... నాలుగేళ్లలో నీవు సాధించిన అభివృద్ధి ఏది.. అధికారాన్ని పదవిని అడ్డం పెట్టుకుని.. వందలకోట్లు సంపాదిం చుకున్నావు.. మళ్లీ గ్రామానికి వచ్చావంటే జాగ్రత్త అని హెచ్చరించడంతో ఎమ్మెల్యే వెనుదిరిగిపోవాల్సి వచ్చిందట.  ఇప్పటికే ఉదయగిరి సీటు త‌న‌కు రాదని తెలియడంతో.. ఆయన మాటల‌ను ఎవరూ లెక్కచేయడం లేదు. ఈ విష‌యం త‌న‌కు కూడా తెలియ‌డంతో ఇక ప్ర‌జ‌ల్లో తిర‌గ‌డం ఎందుకులే అని రామారావుకూడా నిర్లిప్తంగా ఉండిపోయార‌ని అంటున్నారు. మొత్తానికి ఈ వ్య‌వ‌హారంతో పార్టీకి తీర‌ని న‌ష్టం జ‌రుగుతోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. 


bollineni ramarao కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: