భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సంస్థానాలను విలీనం చేసి భారతదేశ సమైక్యతకు కృషి చేసిన మహానుభావుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్.    సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపంలో నిర్మిస్తున్న ఒక స్మారక కట్టడం పేరు స్టాట్యూ ఆఫ్ యూనిటీ. దీనిని తెలుగులో ఐక్యతా ప్రతిమ లేక ఐక్యతా విగ్రహం అని అంటారు. ఈ విగ్రహాన్ని గుజరాత్‌లో నర్మదానది మధ్యలో సర్దార్ సరోవర్ డ్యాంకు మూడు కిలోమీటర్ల దూరంలో నిర్మించేందుకు నిర్ణయించి నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.  నేడు గుజరాత్ నర్మదా నది ఒడ్డున నిర్మిస్తున్న సర్దార్ వల్లభాయ్ విగ్రహాం ఆవిష్కరణకు సిద్ధమైంది.  దేశ తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి,  సంస్ధానాల విలీనాధీశుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ సేవలను యావత్ జాతి మరోసారి స్మరించుకుంది. 
Image result for sardar vallabhbhai patel statue
143వ జయంతి సందర్భంగా వివిధ పార్టీల నేతలు, అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పటేల్ సొంత రాష్ట్రం గుజరాత్ లో నిర్మించిన ఐక్యతా విగ్రహం– స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ ని కాసేపట్లో ప్రధాని జాతికి అంకితం చేశారు భారత ప్రదాని నరేంద్ర మోదీ.  ‘ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' పేరున నిర్మిస్తున్న ఈ విగ్రహం ప్రపంచంలోని విగ్రహాలన్నింటిల్లోకెల్లా అతిపెద్దది కావడం విశేషం. ఇప్పటివరకు చైనాలో ఉన్న బుద్ధుడి విగ్రహం ప్రపంచలో అతి ఎత్తైన విగ్రహంగా ఉంది.
Image result for sardar vallabhbhai patel statue
విగ్రహం తయారీ కోసం  దేశంలోని ప్రతి గ్రామం నుంచి ముడి ఇనుము సేకరించారు. రైతులు వినియోగించిన ఇనుము సేకరించి గుజరాత్‌కు తరలించారు. విగ్రహ ఏర్పాటులో 70 వేల టన్నుల సిమెంట్‌, 18 వేల ఐదు వందల ముడి ఇనుము, ఆరు వేల టన్నుల ఉక్కు, 17 వందల మెట్రిక్ టన్నుల కాంస్యం వినియోగించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు 2013 అక్టోబర్ 31న వల్లభాయ్ పటేల్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్ధాపన చేశారు. 2 వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈ భారీ విగ్రహాన్ని నిర్మించారు.
Related image
ఐదేళ్ల పాటు వందలాది మంది తీవ్రంగా శ్రమించి ఈ విగ్రహాన్ని నిర్మించారు.  ఇటు కాంగ్రెస్ కూడా సర్ధార్ వల్లభాయ్ పటేల్ సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని చేపట్టింది. రాజ్ నాథ్ సింగ్ ఢిల్లీలోని ధ్యాన్ చంద్ స్టేడియంలో ఈ రన్‌ను ప్రారంభించనున్నారు.  గిన్నిస్ రికార్డులకెక్కిన  ప్రఖ్యాత ‘స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ’ కంటే ఇది రెట్టింపు పొడవు. వీక్షకుల కోసం విగ్రహం లోపల 132 మీటర్ల ఎత్తులో గ్యాలరీని ఏర్పాటుచేశారు. ఇక్కడ నుంచి సర్దార్‌ డ్యామ్‌ సహా పలు పర్వత ప్రాంతాలను సందర్శించే సౌకర్యం కల్పించారు. 

Image result for sardar vallabhbhai patel statue

సర్దార్ విగ్రహం ప్రత్యేకతలు:
182మీటర్ల విగ్రహం (597 అడుగులు)వ్యయం రూ.2989కోట్లువిస్తీర్ణం 19700చ.మీ1700 టన్నులు కాంస్యం వినియోగం18500 టన్నుల ఉక్కు వినియోగంలక్షా 80వేల క్యూబిక్ మీటర్ల సిమెంట్ వినియోగం3 వేల మంది కార్మికులు, 300 మంది ఇంజనీర్ల శ్రమ,  రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.5గా నమోదైనా తట్టుకునేలా విగ్రహ నిర్మాణం180కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా విగ్రహ నిర్మాణం.


విగ్రహావిష్కరణ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ..భారత్ కష్టకాలంలో ఉన్న సమయంలో పటేల్ హోంమంత్రి అయ్యారు. విడి విడిగా ఉన్న భారత సంస్థానాలను పటేల్ గనుక ఏకం చేసే ప్రయత్నం చేయకపోయి ఉంటే.. ఈనాడు హైదరాబాద్‌లో చార్మినార్ చూడటానికి వెళ్లడానికి వీసా తీసుకుని వెళ్లాల్సి వచ్చేది.  దేశ వాసులంతా కచ్ నుంచి కోహిమా వరకు, కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయాణించగలుగుతున్నారంటే.. దాని వెనకాల సర్దార్ పటేల్ కృషి దాగుంది.

Image result for pm modi inaguration patel statue

సమైక్యా భారతాన్ని సాధించడానికి ఆయన ఎంతగానో శ్రమించారు.  సర్దార్ పటేల్ విగ్రహ ఏర్పాటును కొంతమంది రాజకీయం చేయడాన్ని, విమర్శించడాన్ని చూసి నేను ఆశ్చర్యపోతున్నా. ఇదేమైనా నేరమా?.. దేశానికి చెందిన ఓ మహోన్నత వ్యక్తిని ఇలా స్మరించుకోవడం నేరమవుతుందా? ఈ విగ్రహం వల్ల స్థానిక గిరిజనులకు ఉపాధి కూడా దొరుకుతుంది.


పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుంది. విగ్రహ తయారీ కోసం ఎందరో ప్రతిభావంతులైన కళాకారులు పనిచేశారు. వాళ్లంతా ఓ గొప్ప చరిత్రలో భాగస్వాములయ్యారు.  సర్దార్ పటేల్ విగ్రహం నవభారతానికి ప్రతీక. 'సర్దార్ పటేల్‌కి జై.. దేశ సమైక్యతా వర్ధిల్లాలి..' అన్న నినాదంతో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. పటేల్ విగ్రహం నవభారతానికి ప్రతీక అని, దీన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయాలనుకోవడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు.

దేశంలో ప్రతీ గ్రామాన్ని అనుసంధానం చేసేలా రోడ్లు, ఆప్టికల్ ఫైబర్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. ప్రతీ ఇంటికి విద్యుత్ సౌకర్యం అందించడానికి మా సర్కార్ పనిచేస్తోంది. అలాగే ప్రతీ ఇంటికి గ్యాస్ సౌకర్యం కల్పించాలన్నదే మా లక్ష్యం. వీటితో పాటు ప్రతీ ఇంటికి గ్యాస్ సిలిండర్స్, టాయిలెట్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా అత్యంత భారీ స్థాయిలో భీమా యోజన కార్యక్రమాన్ని చేపట్టాం.-ప్రధాని మోదీ

మరింత సమాచారం తెలుసుకోండి: