జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం విషయంలో చంద్రబాబునాయుడు వైఖరిని మొట్టమొదటగా పార్టీకి చెందిన  సీనియర్ నేత తప్పుపట్టారు. ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నం విషయంలో చంద్రబాబు తీరుతో మండిపోయిన సీనియర్ నేత తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత మేడపాటి రామిరెడ్డి టిడిపికి రాజీనామా  చేశారు. అందుకు కారణాలేమిటంటే చంద్రబాబు వ్యవహరించిన తీరు నచ్చకే పర్టీకి రాజీనీమా చేశానని చెప్పారు.

 

ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం జరిగితే తొలుత ఆ ఘటనను ఖండించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడుకుందని రామిరెడ్డి భావించారు. తర్వాత ఘటనపై నిజాలు నిగ్గుతేల్చేందుకు నిష్పక్షపాతంగా విచారణకు ఆదేశించాలని చెప్పారు. 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు అలా చేసుంటే ఎంతో హుందాగా ఉండేదని చెప్పారు. అయితే, హత్యాయత్నం ఘటన తర్వాత చంద్రబాబు చేష్టలు తననెంతో మనస్తాపానికి గురిచేసిందని చెప్పారు.

 

పార్టీ విషయంలో, చంద్రబాబు వ్యక్తిత్వంపై పెంచుకున్న నమ్మకాన్ని చంద్రబాబు వమ్ముచేసినట్లు మండిపడ్డారు. అందుకే పదవితో పాటు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేసినట్లు ప్రకటించారు. మానవత్వం ఉన్న వారెవరైనా జగన్ పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించాల్సిందేనన్నారు. అయితే మంత్రులు, ముఖ్యమంత్రి విచక్షణ కోల్పోయి చేస్తున్న వ్యాఖ్యలు తనను ఎంతో బాధిస్తున్నట్లు రామిరెడ్డి చెప్పారు. పార్టీ అధినేత అంత స్ధాయితగ్గి మాట్లాడుతున్నారు కాబట్టే మంత్రులు, నేతలు ఈ విధంగా మాట్లాడుతారంటూ మండిపడ్డారు. జగన్ పై జరిగిన హత్యాయత్నం ఘటనను కూడా తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు చంద్రబాబు, మంత్రులు చూడటం నచ్చకే టిడిపికి రాజీనామా చేసినట్లు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: