పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల ముందు టీడీపీ బీజేపీ కూటమి తరుపున ప్రచారం చేసి హామీల బాధ్యత నాది అన్నాడు చివరికి ఏమైంది బాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. పవన్ గారేమో హాయిగా నాలుగేళ్లు సినిమాలతో గడిపారు. ఇప్పడూ బయటికి వచ్చి శ్రీరంగ నీతులు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అలాగే జగన్ పైన జరిగిన దాడి కేసును పెద్దదిగా చేశారన్నారు. 

జగన్ దాడిపై ఆసక్తికర వ్యాఖ్యలు

శ్రీపాద వల్లభుడు అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన ఆశీస్సులు ఉంటే తాను పిఠాపురం నుంచే పోటీ చేస్తానేమోనని చెప్పారు. ఇక్కడి నుంచి పోటీ చేయాలనేది భగవంతుడి ఆజ్ఞ అయితే చూద్దామన్నారు. చాలామంది తనను ఇక్కడి నుంచి పోటీ చేయమని చాలామంది అడుగుతున్నారని చెప్పారు. అయితే పోటీ తన నిర్ణయం కాదని, సెలక్షన్ కమిటీ అన్ని అంశాలను బేరీజు వేసుకొని చెబుతుందన్నారు. తిరుపతి, అనంతపురం, ఇచ్ఛాపురం నియోజకవర్గాలలో కూడా తనను పోటీ చేయమని కోరుతున్నారని చెప్పారు. అన్ని చోట్ల పోటీ చేయమని చెబుతున్నారని, కానీ నిర్ణయించుకోలేదన్నారు.

చంద్రబాబును చూస్తే బాధేస్తోంది

2014లో టీడీపీకి మనం అండగా నిలబడ్డామని, జన సైనికులను కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో వెళ్లడం చూస్తుంటే బాధేస్తోందని పవన్ అన్నారు. జవాబుదారీతనం లేని పరిస్థితుల్లో జనసేన పుట్టుకు వచ్చిందని చెప్పారు. ఏపీకి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని, అందుకే మూడు ఎన్నికల్లో చోటు దక్కలేదన్నారు. అందుకే జనసైనికుల్ని కాదని కాంగ్రెస్‌తో వెళ్లిన సీఎంను చూస్తుంటే బాధ వేస్తోందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని చెప్పారు. పంచాయతీకి కూడా పోటీ చేయని లోకేష్ పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారని చెప్పారు. ఏపీకి కాంగ్రెస్, బీజేపీ మోసం చేసాయని, వదిలి పెట్టేది లేదన్నారు. మోడీ అంటే తనకు భయం లేదన్నారు. తానేం అతని దత్తపుత్రుడిని కాదన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: