ప్రపంచం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుంది. నింగీ, నేల, సంద్రం ఏకం చేసిన మనిషి తన ప్రాణాలకు ముప్పు వాటిల్లే వాటిని కూడా కనిపెట్టి తనకే ముప్పు తెచ్చుకుంటున్నారు.  ఇందులో ముఖ్యంగా తుపాకీ..ఒకప్పుడు శత్రువులపై వాడటానికి కనిపెట్టింది..ఇప్పుడు ఉన్మాదులు దేనికి పడితే దానికి వాడుతూ..ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.  అమెరికాలో గత కొంత కాలంగా గన్ కల్చర్ విపరీతం అయ్యింది.  ఇప్పటికే పలుమార్లు ఉన్మాదులు గన్ తో అమాయకుల ప్రాణాలు తీసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మరీ దౌర్భాగ్యం ఏంటంటే..మైనర్లు కూడా అక్కడ గన్స్ వాడటంతో ఈ విపరీతాలు మరింత చోటు చేసుకుంటున్నాయి. 
California mass shooting
తాజాగా మరోసారి అమాయకులపై తుపాకీ గర్జించింది. బార్‌లో ఆనందంతో చిందులేస్తున్న వారి శరీరాలను ఛిద్రం చేసింది. లాస్ ఏంజెలెస్ శివారులోని ఓ బార్‌లో జరిగిన కాల్పుల్లో 12 మంది మృతి చెందగా, మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.  లాస్ ఏంజెలెస్‌కు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న థౌజండ్ ఓక్స్‌లోని ‘బోర్డర్ లైన్ అండ్ గ్రిల్’లో భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 12:50 గంటలకు ఈ దారుణం జరిగింది.
Image result for Ex-Marine identified as gunman
వందలాదిమంది యువతీ యువకులు హాజరైన ఈ పార్టీ ఉత్సాహంగా సాగుతుండగా ఒక్కసారిగా తూటాల వర్షం కురిసింది. అనుకోకుండా జరుగుతున్న ఈ పరిణామాలకు యువత చెల్లా చెదురైయ్యారు..రక్తం చిమ్ముతుంది..తూటాల వర్షం కురుస్తుంది. 28 ఏళ్ల నేవీ మాజీ ఉద్యోగి ఇయాన్ డేవిడ్ లాంగ్ తుపాకితో హోరెత్తించాడు. కాల్పులతో బార్‌లో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. ఏం జరిగిందో అర్థమయ్యే సరికే 12 మంది ప్రాణాలు కోల్పోయారు.  మొదట బార్ లో కి ప్రవేశించిన ఉన్మాది అక్కడ వారిపై పొగబాంబు విసిరాడు...దాంతో ఏం జరుగుతుందో అని అనుకుంటున్న లోపే గన్ తో గట్టిగా అరుస్తూ విచక్షనా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు.
Image result for Ex-Marine identified as gunman
దాంతో కొందరు బాల్కనీ నుంచి దూకి తప్పించుకోగా, మరికొందరు కుర్చీలతో అద్దాలు పగలగొట్టి బయటపడ్డారు. మరికొందరు బాత్రూమ్‌లలో దాక్కున్నారు.   సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే పోలీసులపై కూడా దుర్మార్గుడు కాల్పులు జరపగా..ఒక పోలీస్ కుప్పకూలిపోయాడు.  అయితే తనని చుట్టు ముట్టిన పోలీసులు చంపేస్తారని భావించిన ఉన్మాది తనను తానే కాల్చుకున్నాడు.  ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నిందితుడి కాల్పుల వెనక ఉద్దేశం ఏమిటన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఉగ్ర కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: