ఒక్కోసారి అతి తెలివి తేటలు కూడా అనర్ధాన్నే తెస్తాయి. ఇక ఆవేశంతో కూడిన ఆలొచనలు చేసినపుడు అసలు విషయం కూడా మరుగున పడిపోతుంది. విస్త్రుత ప్రయోజనాలు పక్కకు పోయి స్వార్ధమే ముందుకు వస్తుంది. ఏపీ విషయానికి వస్తే  ఈ కుటిల రాజకీయం మూలంగా ఇప్పటికే కష్టాలు నష్టాలు చాలా చూసిన ఈ రాష్ట్రం మరెన్ని షాకులు తినాలోనని మేధావి వర్గం ఆందోళన చెందుతోంది.


హోదా విరోధులు :


చంద్రబాబు  ఇపుడు ఫస్ట్రేషన్ మూడ్ లో ఉన్నారు. ఆయన చూపు అంతా మోడీని గద్దె దింపడం మీదనే ఉంది. అందుకోసం ఆయన ఉరుకులు  పరుగులు పెడుతున్నారు. ఈ సందర్భంలో ఆయన ఏపీ ప్రయోజనాలు, ప్రాణాధారం అయిన ప్రత్యేక హోదా సంగతి పూర్తిగా మరచిపోతున్నారు. ఏపీకి హోదా రాకుండా చేయడంలో మూల కారకులైఅన వారితోనే బాబు దోస్తీ కడుతున్నారు. అది ఆయన తెలిసి చేస్తున్నారా లేక తెలియక చేస్తున్నారా అన్నది పక్కన పెడితే  ఈ తరహా రాజకీయం వల్ల  ఏపీకి తీవ్ర నష్టం మాత్రం తప్పదు.


అడ్డుకున్నది తమిళనాడే :


ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు బీజేపీ సిధ్ధమవుతున్న వేళ అడ్డుకున్నది, అడ్డం పడింది తమిళనాడు అన్నది  బాబుతో సహా చాలా మందికి తెలుసు. అప్పట్లో జయలలిత ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఊరుకోమని ఆమే చాలా క్లారిటీగా చెప్పేసారు. ఏపీకి హోదా ఇస్తే తమ రాష్ట్రానికి అవకాశాలు తగ్గుతాయన్న ఆందోళనతోనే తమిళ రాజకీయం అంతా ఆనాడు బ్రేకులు వేసింది. అందులో డీఎంకే కూడా ఉంది. మరి అటువంటి డీఎంకే అధ్యక్షుదు స్టాలిన్ ని కలసి చంద్రబాబు కూటమి కడుతున్నారు. ఇక్కడ ఏపీకి ప్రత్యేక హోదాకు మేము సమ్మతమే అన్న ఒక్క మాట ఆయన చేత బాబు చెప్పించగలిగారా 


అది చిదంబరం కుట్ర :


ఇక ఉమ్మడి ఏపీని చీల్చాలన్నది కూడా అప్పతి హోం మంత్రి చిందంబరం కుట్రగా చెబుతారు.  ఆయన 2009 డిసెంబర్ 9న ఏపీ విభజనపై ఒక ప్రకటన చేశారు కూడా. ఏపీలో ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్నాయి. దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రం  ముక్కలు అయితేనే తమిళనాడుకు భవిష్యత్తు అని భావించే అలా చేశారంటారు. మరి అటువంటి చిదంబరంతో చెలిమి చెస్తున్నారు చంద్రబాబు. విభజన ఎటూ జరిగిపోయింది. వీరంతా ప్రత్యేక హోదాకు మద్దతు గా ఉంటామని ఒక్క మాట  అయినా ఇపుడు చెబుతారా..


అందరూ వ్యతిరేకులే :


అదే విధంగా చూసుకుంటే కర్నాటకలో జేడీఎస్ నేతలు దేవెగౌడ, కుమారస్వామి, ఉత్తరాదిన మాయావతి, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్ అంతా ఎప్పుడూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎక్కడా గొంతెత్తి మాట్లాడలేదు. బాబు సైతం కూటములు కట్టే తొందరలో అసలు విషయం మరచిపోతున్నారు. ముందు విభజన హామీలపై వారి నుంచి మద్దతు తీసుకుని ఆపైన సొంత  రాజకీయం చేస్తే బాగుంటుంది. కానీ బాబుకు కావాల్సింది ఫక్త్ రాజకీయ ప్రయోజనాలే. అందుకే ఇపుడు హోదా అంశం వెనక్కుపోతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: