వైఎస్ జగన్... వర్తమాన ఏపీ  రాజకీయాల్లో అతి ముఖ్య నాయకుడు. ఏపీ పాలిటిక్స్ ని మలుపు తిప్పుతున్న నేత. ఆయన చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర క్లైమాక్స్ కి చేరుకుంది. ఇంక ఒక్క జిల్లా మాత్రమే మిగిలింది. జగన్ పాదయాత్రలో తొలి రోజు ఎలా ఉత్సాహంగా అడుగులు వేశారో ఇపుడు కూడా అదే హుషార్ కనిపిస్తోంది. మధ్యలో జరిగిన ఘటనల ప్రభావం ఏదూ  ముఖంలో కనిపించకుండా నడచుకుంటూ ముందుకు సాగిపోవడం బహుశా జగన్ కే సాధ్యమేమో..


హత్యాయత్నం పక్కా :


జగన్ ని అంతమొందించేందుకే పక్క స్కెచ్ ప్రకారం హత్యాకు రంగం సిధ్ధం చేశారన్నది తేలిపోతోంది. మరో వైపు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్ విచారణ ఎటూ తేల్చకుండా అలాగే వదిలేసింది. మంత్రులు జగన్ పైన బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. మొదటి రోజు డీజీపీ చెప్పిన మాటకే వారంతా కట్టుబడి ఉన్నారు. జగన్ అభిమాని చేత తానే హత్యా యత్నం డ్రామా ఆడారని మంత్రి నక్కా ఆనందబాబు నిన్నటికి నిన్న మరో మారు ప్రకటిస్తే హత్యా రాజకీయాలు చేయాల్సిన ఖర్మ తమకు పట్టలేదని మరో మంత్రి అయ్యన్నపాత్రుడు సమర్ధించుకున్నారు. ఇంకోవైపు స్పష్టంగా కుట్ర కోణం కనిపిస్తోంది. దీన్ని వదిలేసి అంతా మాట్లాడుతున్నారు అధికార పక్షం నాయకులు.


కోర్టు ఏం చెబుతుంది :


ఇక ఈ రోజు జగన్ హై కోర్టులో వేసిన పిటిషన్ విచారణకు వస్తుంది. ఏపీ సర్కార్ ప్రమేయం లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని జగన్ ఆ పిటిషన్లో కోరారు. దాంతో కోర్టు ఏం చెబుతుందా అని సర్వత్రా ఆసక్తి వ్యక్తం  అవుతోంది. కోర్టు ఇంతవరకూ సిట్ జరిగిపిన విచారణపై నివేదిక కోరింది. దానిని బట్టీ తదుపరి నిర్ణయం ఉండొచ్చునని అంతా భావిస్తున్నారు.


జగన్ పెదవి విప్పుతారా :


ఈ కేసు ఇలా ఉండగానే జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లాలో ప్రారంభించేశారు. ఆయన మౌనంగానే తొలి రోజు నడిచారు. ఎప్పటి మాదిరిగానే ప్రజలను పలకరిస్తూ ముందుకు పోయారు. జగన్ అసలు ఏం చెబుతారు అన్న ఉత్కంఠ  అటు అధికార పక్షంతో పాటు అందరిలోనూ ఉంది. కానీ ఆయన పెదవి విప్పడం లేదు. కనీసం మీడియాకు కూడా అవకాశం ఇవ్వలేదు. 


ఇక మరో రెండు రోజుల్లో జగన్ పాదయాత్ర పార్వతీపురం చేరుకుంటుంది. అక్కడ జరిగే బహిరంగ సభలో జగన్ నోరు విప్పుతారని అంతా అనుకుంటున్నారు. అప్పటికి హై కోర్టు స్పందన కూడా వెలువడుతుందని, అన్నీ చూసుకుని జగన్ తన మనసులోని ఆవేదనను వేలాదిగా ఉన్న జనం మధ్యలోనే పంచుకుంటారని  అంతా భావిస్తున్నారు. మొత్తానికి పార్వతీపురం మీటింగు పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: