సోష‌ల్ మీడియా దెబ్బ‌కు సాధార‌ణ మీడియా ఒకింత వెనుక‌బ‌డింద‌నే చెప్పాలి. విష‌యం ఏదైనా.. క్ష‌ణాల్లో స్పంద‌న రావడం.. నిముక్షాల్లోనే చ‌ర్చ‌లు పెట్టి.. ఎవ‌రి అభిప్రాయం వారు వెల్ల‌డించ‌డం సోష‌ల్ మీడియాలోనే చెల్లింది. దీంతో ఇప్పు డు వాట్సాప్‌, ఫేస్‌బుక్, ట్విట్ట‌ర్ల‌కు క్రేజ్ పెరుగుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన ఓ స‌ర్వేలో.. వాట్సాప్ వినియోగం.. అభిప్రాయాలు పంచుకోవ‌డం, వెనువెంట‌నే స్పందించ‌డం వంటి విష‌యాల్లో హైద‌రాబాద్ ముందుంటే.. ఏపీలోని విశాఖ‌, విజ‌య‌వాడ‌, గుంటూరు న‌గ‌రాలు త‌ర్వాత స్థానాల్లో ఉన్నాయ‌ని తెలిసింద‌ట‌. దీంతో ఇప్పుడు ప్ర‌తి రాజ‌కీయ పార్టీ కూడా.. ట్విట్ట‌ర్ వాట్సాప్‌, ఫేస్‌బుక్ వంటి మాధ్య‌మాల‌ను ఖ‌చ్చితంగా వినియోగిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ మూడు సోష‌ల్ మాధ్య‌మాల విష‌యంలో అధికార పార్టీ టీడీపీ దూసుకుపోతోంది. 


టీడీపీ త‌ర్వాత స్థానంలో జ‌న‌సేన ఉండ‌డం వైసీపీకి షాకిస్తున్న విష‌యం. వాస్త‌వానికి ఓ నాలుగు నెల‌ల కింద‌టి వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో టీడీపీతో స‌మానంగా వైసీపీ దూకుడు ప్ర‌ద‌ర్శించింది. అయితే, జ‌గ‌న్ పాద‌యాత్ర కు సంబందించిన విష‌యాల‌నే ఓవ‌ర్ చేసి పోస్టు చేస్తుండ‌డం.. మ‌రోప‌క్క‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.. ట్విట్ట‌ర్‌లో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుండ డంతో అంద‌రూ టీడీపీ త‌ర్వాత జ‌న‌సేన‌కే మొగ్గు చూపుతున్నారు. ఇక‌, తాజాగా నిర్వ‌హించిన ఓ ఆన్‌లైన్ స‌ర్వేలో ఏపీలో మ‌ళ్లీ వ‌చ్చే అధికార పార్టీపై ప్ర‌జ‌లు త‌మ త‌మ అబిప్రాయాల‌ను నిర్మొహ‌మాటంగా వెల్ల‌డించారు. పాల‌న విష‌యంలోనూ.. స‌మ‌న్వ‌యం విష‌యంలోనూ.. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలోనూ 5 ప్ర‌శ్న‌లు సంధించ‌గా.. ప్ర‌జ‌లు ఇచ్చిన స‌మాధానాలు చాలా ఆస‌క్తిక‌రంగా ఉన్నాయ‌ని తెలిసింది.


ఏపీలో అధికార పీఠం కోసం త‌హ‌త‌హ‌లాడుతున్న ముగ్గురు నేత‌ల విష‌యంలోనూ ప్ర‌జ‌లు ఏమీ త‌ప్పుప‌ట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. సీఎం సీటును తిరిగి తానే ద‌క్కించుకోవాల‌ని చంద్ర‌బాబు. వ‌చ్చే సారైనా తాను అధికారంలోకి రావాల‌ని జ‌గ‌న్‌. కాదు.. కానిస్టేబుల్ కొడుకు సీఎం కాకూడ‌దా? అని ప‌వ‌ను.. ఇలా ఈ ముగ్గురూ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను ప్ర‌జ‌లు త‌ప్పుప‌ట్ట డం లేదు. అయితే, ఇక్క‌డే  వారు ``స‌మ‌ర్ధ‌త‌-అనుభ‌వం``- అనే అంశాల ప్రాతిప‌దిక‌న త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించా రు.

అన్నీ ఉన్న రాష్ట్రానికి సీఎం ఎవ‌రు అయినా.. త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని, అయితే, ఇప్పుడు ఏపీ కీల‌కమైన పొజి ష‌న్‌లో ఉంద‌ని, అనుభ‌వాన్ని రంగ‌రించ‌గ‌ల‌.. ఎవ‌రినైనా ఢీకొట్ట‌గ‌ల నాయ‌కులు రాష్ట్రానికి అవ‌స‌రమ‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌కు జై అన్న వారు.. ప‌వ‌న్ వ‌చ్చినా.. త‌మ‌కు న‌ష్టం లేద‌న్న వారు .. చంద్ర‌బాబు బెట‌ర్ అని తీర్మానించ‌డం విశేషం. సో.. ఇదీ ఇప్ప‌టికిప్పుడు ప్రజ‌ల మ‌న‌సులో మాట‌!


మరింత సమాచారం తెలుసుకోండి: