పవన్ కళ్యాణ్ అధికార పక్షాన్ని వదిలేసి జగన్ ను విమర్శించడం ఆపార్టీ లోని కార్య కర్తలకు కూడా నచ్చడం లేదు. అర్ధం పర్ధం లేని ఆరోపణలతో ఉన్న పరువు పోగొట్టుకుంటున్నాడు. అయితే 2019 లో జగన్ కు భారీ మెజారిటీ వచ్చి పవన్ కళ్యాణ్ కు పట్టుమని 5 సీట్లు కూడా రాకపోతే పవన్ తల ఎక్కడ పెట్టుకుంటాడు అని వైసీపీ అభిమానులు ఆరోపిస్తున్నారు. మళ్ళీ అంతే ధైర్యంగా విమర్శలు చేయగలడా...! పవన్ విమర్శలకు వైసీపీ కూడా గట్టిగానే కౌంట్ ఇచ్చింది. 


జగన్ మీద అర్ధం పర్ధం లేని ఆరోపణలతో పవన్ పరువు గంగలో కలిసి పోతుందే...!

దీంతో పవన్ విషయంలో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న వైసీపీ ఇప్పుడు ఎదురుదాడికి దిగింది. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ జనసేనానిని కడిగిపారేశారు. ఈమధ్య ఓ మీటింగ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారినే తాను ఎదిరించానని పవన్ కల్యాణ్ చెప్పడాన్ని బొత్స తప్పుబట్టారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్ లో అసలు పవన్ ఎక్కడున్నాడని, ప్రజారాజ్యం పెట్టిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన పవన్, వైఎస్ఆర్ ని ఎదిరించానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు బొత్స. కనీసం ఆయన పక్కన ఉన్న కాంగ్రెస్ మాజీనేత నాదెండ్ల మనోహర్ అయినా పవన్ ని ఎందుకు వారించలేకపోయారో అంటూ ఎద్దేవా చేశారు.


జగన్ మీద అర్ధం పర్ధం లేని ఆరోపణలతో పవన్ పరువు గంగలో కలిసి పోతుందే...!

ఏరోజు ఏం మాట్లాడతారో, ఎవరితో కలిసుంటారో, ఎక్కడికి వెళ్తారో తెలియని వ్యక్తి పవన్ అంటూ సెటైర్లు వేశారు బొత్స. కులాల గురించి సంబంధం లేదంటూనే కులాల గురించి మాట్లాడే పవన్ ని జనం ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. పవన్ సామాజిక వర్గానికి ఉన్న ఓటుబ్యాంక్ చూసే 2014లో చంద్రబాబు ఆయన్ను దగ్గరకు తీశారని చెప్పారు. కులంతో సంబంధం లేదని చెప్పే పవన్ ఇంటిపేరు ఎందుకు మార్చుకోడు అంటూ ప్రశ్నించారు. పెద్ద పెద్ద స్వాతంత్ర సమరయోధుల పేర్లు చెప్పి, వారి కొటేషన్లు వాడుతూ పవన్ డాంబికాలు పలుకుతుంటారని, పవన్ కి అంత సీన్ లేదని తీసిపారేశారు బొత్స సత్యనారాయణ. మాట్లాడితే జగన్ కు ముఖ్యమంత్రి పదవిపై ఆశ అంటూ విమర్శించే పవన్ అసలు తాను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడో చెప్పాలని నిలదీశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: