పవన్ కళ్యాణ్ చేసే పనులు ఎవరికీ అర్ధం కాదు . అలా ఎందుకు చేస్తున్నారని ఎవరైనా అడిగితే నేను మహా మేధావినని పవన్ మాటలు స్టార్ చేస్తాడు. అయితే పవన్ తన అజ్ఞానాన్ని బయట పెట్టె మరో పని చేయబోతున్నాడు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ చెన్నై వెళుతున్నారు. నేషనల్ మీడియాను ఉద్దేశించి అక్కడ ప్రధానంగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారు. నిజానికి కమల్ హాసన్ వంటి తమిళనాడులోని కొత్త స్టార్ స్టడెడ్ పార్టీల నేతలతోనూ సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లుగా వినిపిస్తున్నది గానీ.. వాస్తవంలో.. నేషనల్ మీడియాతో ప్రెస్ మీట్ నిర్వహించడం వరకు గ్యారంటీ!

Image result for pavan kalyan janasena

కానీ నేషనల్ మీడియాతో మాట్లాడడం అంటే పవన్ కల్యాణ్ ఏం అనుకుంటున్నారో మాత్రం బోధపడ్డం లేదు. జాతీయ మీడియాతో మాట్లాడడం అనేదేదో పెద్ద విషయం లాగా.. జాతీయ మీడియాతో మాట్లాడిన వెంటనే జాతీయస్థాయి నాయకుడిగా అయిపోతాం అన్నట్లుగా పవన్ కల్యాణ్ కొన్నిరకాల భ్రమల్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. మోడీ మీద దాడి చేయాలని అనుకున్నప్పుడెల్లా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి నేషనల్ మీడియాతో మాట్లాడడం అనేతంతు చూసి స్ఫూర్తి పొంది... తాను ఢిల్లీ వెళితే కాపీ కొట్టినట్టుగా ఉంటుందని.. చెన్నై వెళ్లి  మాట్లాడదలచుకున్నారేమో అనిపిస్తుంది.

‘‘ఐ... ది పవన్ కల్యాణ్...’’

పవన్ కల్యాణ్ చెన్నై వెళ్లి జాతీయ మీడియాతో ఏయే జాతీయ అంశాల మీద తన అమూల్యమైన అభిప్రాయాలు వెల్లడిస్తారనేది తర్వాతి సంగతి. అయితే జాతీయ మీడియా అనేది తాను నివసించే హైదరాబాదులో గానీ, రాజకీయాలు చేయదలచుకుంటున్న విజయవాడలో గానీ ఉంటుంది కదా.. అనే సంగతి పవన్ కు తెలియదా అనేది ఇక్కడ సందేహం. జాతీయ అంశాలను మాట్లాడాలంటే.. ముందు ఆ నాయకుడికి జాతీయ స్థాయి ఉండాలి. అంతేతప్ప.. ఢిల్లీలోనో చెన్నైలోనో మాట్లాడినంత మాత్రాన సరిపోదు. పవన్ కల్యాణ్ ఇప్పటిదాకా నాయకుడిగా తాను జాతీయ స్థాయి వాడినని ఏ దశలోనూ నిరూపించుకోలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: