తెలంగాణాతో పాటు డిసెంబర్ 7న 200 శాసనసభ స్థానాలున్న రాజులకోట రాజస్థాన్ లో ఎన్నికలు జరగనున్నాయి. రేపటితో నామినేషణ్ల పరిశీలన జరిగిన తరవాతే బరిలో ఎందరున్నారో తెలుస్తుంది. అయితే ఇప్పటికి 3295 మంది 4288 నామినేషణ్లు 200 శాసనసభ నియోజక వర్గాల ఎన్నికల కోసం ఫైల్ చేశారు. రేపటికి నామినేషణ్లు విత్-డ్రా చేసుకునే వీలుంది. అందుకే రేపటివరకు బరిలో నిలిచేవారి సంఖ్య తెలిసిపోతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి ఆనంద్ కుమార్ చెప్పారు. జయపూర్ కు చెందిన 19 స్థానాల కోసం 632 నామినేషణ్లను 502 మంది సభ్యులు సమర్పించారు డిసెంబరులో కొత్త శాసనసభ కొలువుతీరనుంది.

Image result for ashok gehlot vs vasundhara 

కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలను అమిత్ షా తప్పు పడుతూ "భారతమాతా కి జై! అనవలసిన చోట సోనియా కి జై!" అనటం క్షమించరానిదని అన్నారు. ఇదే రాజవంశ రాజకీయాలకు పరాకాష్ట అని కాంగ్రెస్ కు హెచ్చరిక చేశారు. ఒక చాయ్ వాలా ఈ దేశ ప్రధాని. ఒక పోస్టర్ బోయ్ ఈ పార్టీకి ప్రధాన కార్యదర్శి అని డైనాస్టీ పోలిటిక్స్ అంటున్నవారికి సరిగా సమాధానం చెప్పారు అమిత్ షా. ఇంత సామాన్యత నిడంబరత కాంగ్రెసులో సాధ్యమా? అని ప్రశ్నించిన విధానం అక్కడ రాజకీయా లను గుఱించి చెప్పకనే చెపుతుంది. బిజెపికి రాజస్థాన్లో భంగపాటు తప్పదని సర్వేలు ఋజువు చేస్తున్నా బిజెపి మాత్రం గెలుపుపై చాలా ఆత్మ విశ్వాసంతో ఉంది.  కాంగ్రెస్ నాయకత్వంలోని మహఘట్భంధన్ చాలా బలహీనంగా ఉందని (మజ్బూర్) కాంగ్రెస్ అంటున్నట్లు బలంగా (మజ్బూత్) లేదని చెప్పారు.

 

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అశోక్ గెహ్లట్ మాట్లాడుతూ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియా తన నియోజక వర్గం జోధ్-పూరును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మార్వార్ ప్రాంతాన్ని కూడా అత్యంత ధారుణంగా వంచించిందని - చేసిన వాగ్ధానాలు మరచి రాష్ట్రాన్ని పేదరికంలోకి మరింత అఘాధంలోకి నెట్టేసిందని రాష్ట్రం అభివృద్ధి మరచి తిరోగమనంలోకి ప్రయాణిస్తుందని చెప్పారు.

Image result for ashok gehlot vs vasundhara

కాంగ్రెస్ ఇప్పుడే తిరుగుబాటుదార్ల సమస్యలతో మురిగిపోతుందని వారి అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత అంధకారంలోకే పడిపోతుందని బిజెపి ప్రతినిధులు అంటున్నారు. రెబల్స్ బెడదను సమసిపోయేలా చేసి వారిని సమ్మతింపజేసి వారిని పార్టీకి అనుకూలంగా మార్చగలమని అశోక్ గెహ్లట్ సమాధానమిచ్చారు. యువతను ఎన్నికల్లో నిలిపి కాంగ్రెస్ ను మరింత శక్తివంతంగా చేయగలమని ముక్తాయింపు నిచ్చారు గెహ్లట్.

 Image result for ashok gehlot vs vasundhara

వసుంధరా రాజే నియంతృత్వపు పోకడలతో జరిగిన గత నాలుగేళ్ల పాలన ఖచ్చితంగా బిజెపి పతనం అంచులకు చేరుతుందని సర్వే నివేదికలు వెళ్ళడిస్తున్నాయి. పై విధంగా మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బలమైన రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతోంది బీజేపీ రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో.  గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ.

rajasthan: bjp's dausa mp harish chandra meena joins congress 

ఇదే సమయంలో కమలదళానికి సొంత పార్టీ ఎంపీనే పెద్ద షాక్ ఇచ్చారు. బీజేపీకి గుడ్ బై చెప్పి హస్తం పంచన చేరారు. ఎంపీ హరీష్ చంద్ర మీనా బుధవారం మాజీ సీఎం అశోఖ్ గెహ్లాట్, కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలెట్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 

Image result for rajasthan election survey

మాజీ ఐపీఎస్ అధికారి అయిన మీనా 2009 నుంచి 2013 వరకు రాజస్థాన్ డీజీపీగా పనిచేశారు. 2014లో బీజేపీలో చేరారు. రాజస్థాన్‌లో మీనాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న దౌసా లోక్‌సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. అలాగే తూర్పు రాజస్థాన్‌ లో కూడా మీనాలు ఎక్కువమంది ఉండటంతో, అది తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరో 15  రోజుల్లో రాజస్థాన్‌లో పోలింగ్ జరగబోతోంది. ఇలాంటి సమయంలోనే సీనియర్ నేతగా ఉన్న హరీష్ మీనా పార్టీని వీడటం బీజేపీకి ఎదురు దెబ్బేనని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: