అందుబాటులో ఉన్న సమాచారం చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు మొదలయ్యాయి. ప్రతీ రోజు తాను నిప్పునని, పారదర్శకతంతే తనకు ప్రాణమని చెప్పుకుని చంద్రబాబు కూడా పన్నులు ఎగవేశారట. అందరికీ తెలిసింది హెరిటేజ్ కంపెనీ మాత్రమే. తాము సంపాదిస్తున్న కోట్లాది రూపాయలు పాలు, పండ్లు అమ్ముకునే సంపాదిస్తున్నట్లుగా చంద్రబాబు, చినబాబు లోకేష్ కథలు చెబుతుంటారు. తాజాగా ఇటువంటి కథనే లోకేష్ మీడియాలో చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే లోకేష్ తమ కుటుంబ ఆస్తులు ప్రకటించిన రోజే రామారావు అనే న్యాయవాది చంద్రబాబు కుటుంబ ఆస్తులు, హెరిటేజ్ కంపెనీపై ఆరోపణలు చేస్తూ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) కేసు వేయటం గమనార్హం.

 

రామారావు చేసిన ఫిర్యాదు  ప్రకారం చంద్రబాబు కుటుంబ ఆస్తులపైన, కంపెనీల విషయంలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కోరారు. చంద్రబాబు, భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రాహ్మణిలు హెరిటేజ్ కంపెనీతో పాటు మరో 20 కంపెనీలకు సంబంధించి పెద్ద మొత్తంలో పన్నులు ఎగవేసినట్లు ఆరోపించారు. పన్నులు ఎగవేత వల్ల తెలంగాణ ఖజానాకు భారీగా నష్టం వచ్చిందన్నారు. చంద్రబాబు కుటుంబానికి హెరిటేజ్ కంపెనీ మాత్రమే కాకుండా హెరిటేజ్ కంపెనీ పేరుపైనే హెరిటేజ్ ఫుడ్స్, హెరిటేజ్ ఆగ్రో మెరైన్ లిమిటెడ్, హెరిటేజ్ న్యూట్రివెట్ లిమిటెడ్, నిర్వాణ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, నిర్వాణ ప్యాకేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్, నిర్వాణ ఎనర్జీ ప్రైవేట్ లిమిటాడ్, నిర్వాణ ప్రైవేట్ పవర్ లిమిటెడ్, నిర్వాణ ఎస్టేట్స్ ప్రైవేటు లిమిటెడ్, హెరిటేజ్ కాన్ ప్రో లిమిటెడ్, నిర్వాణ లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, రెడ్ హిల్స్ లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, మెగాబిడ్ ఫైనాన్స్ అండ్డ ఇన్వెస్టిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్, నిర్వాణ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీలున్నట్లు న్యాయవాది చెప్పారు.  

 

రామారావు చెబుతున్నదాని ప్రకారం పై కంపెనీలన్నీ షెల్ కంపెనీలేనట. కంపెనీల చట్టం కింద నిపుణుల బృందం రంగంలోకి దిగితే తప్ప మనీ ల్యాండరింగ్ కింద జరిగిన ఆర్ధిక నేరాలు బయటపడవన్నారు. మనీ ల్యాండరింగ్ తదితరాలను అరికట్టేందుకు కేంద్రం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నేరస్తులు ఏదో ఓ మార్గంలో నేరాలు చేస్తు తప్పించుకుంటున్నారని ఆరోపించారు. తన ఆరోపణలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు అధికారులు రంగంలోకి దిగితే తప్ప వాస్తవాలు బయటకు రావన్నారు. పై కంపెనీల యజమాన్యాలు, ఆస్తి, అప్పుల పట్టీలను, వార్షిక నివేదికలు తదితరాలను క్షుణ్ణంగా పరిశలించాలనే ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయాలని తాను కోరుతున్నట్లు రామారావు తన పిటీషన్లో చెప్పటం గమనార్హం. మరి రామారావు పిటీషన్ పై ఆర్వోసీ ఏ విధంగా స్పందిస్తుందో అని ఆసక్తి మొదలైంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: