తెలంగాణలో ఎన్నికల జోరు కొనసాగుతుంది.  ఈ నేపథ్యంలో గెలుపు కోసం ఇప్పటికే పార్టీ అధినేతలు రంగంలోకి దిగారు.  టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు కేటీఆర్, హరీష్ రావులు కూడా తమ ప్రచారాన్ని విసృతం చేస్తున్నారు.   ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలతో డబ్బు పంపిణీ వరదలా సాగుతుంది.  నేడు తెలంగాణలో జాతీయ స్థాయి  నేతలు పర్యటిస్తున్నారు.  బీజేపీ నుంచి అమిత్ షా, మహాకూటమి తరుపు నుంచి రాహూల్ గాంధీ, టీటిడీ తరుపు నుంచి ఏపి సీఎం చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. 

అయితే రాష్ట్రాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు విచ్చలవిడిగా పంచుతున్నారని..అన్ని వైపులా పోలీసులు గట్టి నిఘా పెట్టారు.  అయినా కూడా డబ్బు బయట పడుతూనే ఉంది. తాజాగా కొడంగల్ లో భారీ ఎత్తున నగదు బయట పడింది.  బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఐటీ అధికారులు పక్కా సమాచారం మేరకు కోడంగల్‌లో నరేందర్ రెడ్డి బంధువు జగన్నాధరెడ్డి ఫామ్ హౌస్‌పై దాడులు నిర్వహించారు.  ఎన్నికల నేపథ్యంలో ఐటీ అధికారుల సోదాలతో కొడంగల్‌లో రాజకీయ కలకలం చెలరేగింది. 

టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి సమీప బంధువుగా భావిస్తున్న జగన్నాధరెడ్డి ఫామ్ హౌస్‌లో పెద్ద మొత్తంలో నగదు బయటపడింది.  భారీ ఎత్తున నగదు, కొన్ని రసీదులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున బలగాలను మోహరింపజేసింది.  నగదు బయటపడ్డ మాట వాస్తవమేనని ఎన్నికల కమిషనర్ రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. తాజాగా ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: