తెలంగాణలో రాబోయే ఎన్నికలను అన్ని పార్టీల వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.  ఇప్పటికే ఆయా పార్టీల అధినేతలు ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.  తెలంగాణలో కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, టికాంగ్రెస్ మద్య హోరా హోరీగా యుద్దం కొనసాగుతుంది.  ఇరు పార్టీ అభ్యర్థులు గట్టి పోటీమీదే ఉన్నారు.  ముఖ్యంగా రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ పైనే అందరి దృష్టి ఉంది.  ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న మహాకూటమి లో భాగస్వామ్యం అయిన టి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి తనను ఓడించేందుకు టీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తుందని ఆరోపిస్తూ వస్తున్నారు.
Image result for revanth reddy kcr
కాగా, నిన్న రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో భారీ ఎత్తున నగదు పట్టుబడింది. టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి సమీప బంధువుగా భావిస్తున్న జగన్నాథరెడ్డి ఫాంహౌస్ లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించగా ఈ మొత్తం బయటపడింది.  ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ధృవీకరించారు. దాంతో నిన్నటి నుంచి కొడంగల్ లో ఇతర ప్రదేశాల్లో పకడ్భందీ తనిఖాలు జరగడం మొదలయ్యాయి.
 రేవంత్ రెడ్డిపై నరేందర్ రెడ్డి పోటీ
తాజాగా ఈ విషయం పై స్పందించిన కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..కొడంగల్ నియోజకవర్గంలో తనను ఓడించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి రూ. 100 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయని తాను తొలి నుంచి చెబుతూనే ఉన్నానని, ప్రస్తుత తనిఖీల్లో అది నిజమైందని అన్నారు.  తనకు తెలిసిన సమాచారం ప్రకారం, కొడంగల్ టీఆర్ఎస్ నేతల ఇంట రూ. 15 కోట్ల నగదు, రూ. 25 కోట్ల నగదు పంపిణీ స్లిప్పులు లభించాయని ఆయన అన్నారు. 

ప్రజాబలంతో తనను ఓడించే చేతకాక డబ్బుతో ఓటర్లను ప్రలోభ పెట్టాలని చూస్తున్న వారి పప్పులు ఉడకవని..ఈసారి టీఆర్ఎస్ కి ప్రజలు గట్టిగానే బుద్ది చెబుతారని ఆయన అంటున్నారు. తనను ఓడించడం సాధ్యం కాదని తెలిసి కూడా కేసీఆర్ మొండిగా వెళుతున్నారని ఆరోపించిన ఆయన, డబ్బు దొరికిన కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: