ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నల్లారి కిరణ్ కుమార్ సీఎంగా ఉన్న సమయంలో ఎంపి లగడపాటి రాజగోపాల్ హవా బాగా కొనసాగేది.  తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే రాజగోపాల్ చేసే సర్వే పై మాత్రం అన్ని రాజకీయా పార్టీలు ఎంతో ఆసక్తి చూపిస్తుంటాయి. ఒకప్పుడు ఈయన చెప్పిన జోస్యం బాగానే ఫలించింది. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతుండటంతో.. అందరూ రాజగోపాల్ సర్వేలో ఏం చెప్పబోతున్నారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.   
Image result for telangana elections
తాజాగా తిరుపతిలో తిరుమలేషుడిని దర్శించుకున్న తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రలోభాలకు ఓటర్లు లొంగడం లేదని..ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా ప్రజలు ఓట్లు వేయబోతున్నారని తెలిపారు. 8 నుంచి 10 మంది వరకు స్వతంత్ర అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పారు. 
Image result for telangana elections
మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ్‌పేటలో శివకుమార్.. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్‌లో అనిల్ జాదవ్ గెలవబోతున్నట్లు వారి పేర్లతో సహా చెప్పారు. రోజుకు ఇద్దరు చొప్పున గెలిచే స్వతంత్ర అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తానన్నారు.  డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు ముగిసిన తర్వాత అన్ని వివరాలను వెల్లడిస్తానని తెలిపారు. ఈరోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: