సేవ్ ఏపి అంటూ రెండురోజుల క్రితం హైదరాబాద్ లో నిర్వహించిన సమైక్యసభ వెనుక ఓ షాకింగ్ న్యూస్ ఉన్నదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ సభకు కర్త, కర్మ, క్రియ అంతా తానై నడిపించాడు అన్న ఆరోపణలు ముఖ్యమంత్రిపై తెలంగాణ వాదులు వెల్లువలా చేసిన విషయమైతే అందరికి తెలుసు, అదే నిజమట, దాని ద్వారా అటుకేంద్రానికి,ఇటు రెండు నాలుకలతో ప్రజల్లో తిరుగుతున్న వారి సమైక్యం అంటే వచ్చే జనస్పందన ఏంటో చూపించి, అదే పార్టీని పెట్టబోతున్నాను అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరోక్షసంకేతాలు జారీ చేసేందుకే ఈ సభ పెట్టారు అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య పార్టీ ప్రమోషన్ వర్క్ లో విజయవాడ ఎంపీ లగడపాటి బిజీగా గడుపుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇక్కడ ఏపిఎన్జీఓల సభ ముగిసిందో లేదో, అశోక్ బాబు కంటే ముందుగానే విజయవాడలో ఎంపీ లగడపాటి మీడియా సమావేశం పెట్టి మరి సభ విజయంతం అయిందని ప్రకటించి దానికి సహకరించిన వారందరికి కృతజ్ఞతలు చెప్పడం విశేషం. ఉద్యోగుల ఉద్యమాన్ని వెనుక నుండి నడిపిస్తున్నది ముఖ్యమంత్రే అని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి కూడా.

లేకపోతే హైదరాబాద్ లో అంత ఖర్చుతో కూడుకున్న సభను నెలరోజులుగా జీతాలు లేని ఉద్యోగులు నిర్వహించారంటే వారికి అంత పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం ఎవరిచ్చింటారు, బస్సులు ఇతరత్ర ఖర్చులు భరించి రావడానికి వారికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటే సమైక్యపార్టీ పెట్టాలనుకుంటున్న వారి నుంచే అని అందరు గుసగుసలాడుకుంటున్నారు.

సరే సమైక్యం కోసం ఉద్యమిస్తున్నవారికి సంపన్నులైన సమైక్యవాదులు ఆర్థిక సహాయం చేయడంలో తప్పులేదు, ఏ ఉద్యమమైనా చందాలు, సహాయాలతోనే ముందుకు పోతుంది. కాని ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి, ఆయన సమైక్య టీం కలిసి దీనిని ఏర్పాటు చేయించి పార్టీ ప్రకటనకు ముందు పార్టీ సన్నాహక సభను నిర్వహించి సత్తా చాటారన్న వదంతులయితే రాజకీయ వర్గాలనుంచి వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: