భారత దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే మద్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం లో పోలింగ్ జరిగింది.  ఇక ఈ నెల 7న తెలంగాణ, రాజస్థాన్ లో ఎన్నికలు జరగబోతున్నాయి.  అయితే మద్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం లో ఫలితాలు ఈ నెల 11న వెలువడనున్నాయి. దాంతో ఈవీఎం ల వద్ద గట్టి బందోబస్తున్న నిర్వహిస్తున్నారు. 
Rewa collector preeti maithil nayak statement Shoot someone if you come nea
తాజాగా మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత, ఈవీఎంల భద్రతపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ, రీవా జిల్లా కలెక్టర్ ప్రీతి మైథిలి సంచలన ఆదేశాలు జారీచేశారు. భోపాల్ లోని ఓ స్ట్రాంగ్ రూమ్ లో అమర్చిన సీసీటీవీ కెమెరాలు పని చేయక పోవడం పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. 

ఇంత పకడ్భందీగా ఉన్న సమయంలో సిసి కెమెరాలు పనిచేయకపోవడం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీ సభ్యులు.  ఈ నేపథ్యంలో ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూముల్లో రక్షణ సిబ్బందిని పెంచుతున్నామని, ఈవీఎంల దగ్గరకు ఎవరైనా వస్తే వారిని కాల్చిపారేయాలని ప్రీతి మైథిలి ఆదేశించారు.
Image result for preeti maithil collector of rewa
కాంగ్రెస్ నేత అభయ్ మిశ్రాతో పాటు స్ట్రాంగ్ రూమ్‌ లను పరిశీలించిన ఆమె, ఈవీఎంలు భద్రంగానే ఉన్నాయని అన్నారు. అంతే కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ అపరిచితులు తిరిగినా..గందరగోళం జరిగినా..పరిమిషన్ లేకుండా ఈ ప్రాంతంలోకి ఎవరు వచ్చినా కఠిన చర్యలు ఉంటాయని, 11వ తేదీ వరకూ అనుక్షణం ఈవీఎంలను కాపాడతామని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: