చంద్రబాబు నాయుడిది స్వయం ప్రేరిత ప్రజాదరణ మాత్రమే అంటే-సెల్ఫ్ ఇండ్యూస్డ్ పాపులారిటీ - ఇదెక్కువ కాలం నిలవదు. అందుకే పదే పదే చెపుతూ తన గొప్పతనాన్ని ఆయనకై ఆయనే ప్రతిసారి పునరుద్ధరించుకుంటు ఉంటారని, అంటారు ఆయన్ని చాలాకాలం నుండి గమనించే రాజకీయ విశ్లేషకులు.


అనేకమంది తరచూ చర్చించే ఆయన అభిమతాలు క్రింద క్రోడీకరించటం జరిగింది.

Image result for chandrababu in deep depression

*తన వారసులు తను తన తరవాత తన కుమారుడు లోకేష్ ఆతరవాత తన మనవడు దేవాన్ష్ రాజ్యాధికారం తనలాగా అనుభవించాలని అనేది ఆయన మనోగతం.


*తన ఆస్తుల అభివృద్ది సంపాదన పరిరక్షణ కోసం తనకు తనవారికి అధికారం ఎల్లవేళలా కావాలి. వాటిపై దేశంలోని లేదా రాష్ట్రంలోని విచారణ సంస్థలకు విచారించే అధికారం ఎలాంటి పరిస్థితుల్లో ఉండరాదు. అందుకే ఆయన తన రాష్ట్రంలో నో ఎంట్రీ ఫర్ సిబీఐ అంటూ జీఓ విడుదల చేశారు.


*పోలవరం, నదుల అనుసంధానం, పేదప్రజలకిచ్చే అన్నీ సంక్షేమ పథకాలలో పొంగిపొరలే అవినీతిని ఎవరూ ప్రశ్నించకూడదు. ఆదే జరిగితే వారిని శాంతి భద్రతల సమస్య కింద మూసేస్తారు.

Image result for ktr on chandrababu naidu

*రాష్ట్రంలో తన సామాజిక వర్గానికే అన్నీ అవకాశాలు కట్టబెట్టి తన కులవివక్షతను చాటుకున్నారు. అంతే కాదు ఎవరు ఎస్సి, ఎస్టి బీసి కులాలలో పుట్టాలని అనుకోరని ఒక ప్రజాస్వామ్య వ్యతిరేఖ ప్రకటన ఈ కాలంలో కూడా చేయగలిగారంటే ఆయన లోపల పొంగి పొరలే ఫ్యూడలిస్టిక్ భావన లను గుర్తించాల్సిందే.

Image result for CM Ramesh frauds

*అనంతమైన బందుప్రీతితో తనవాళ్ళకే సమస్థ ప్రయోజనాలను, భూదోపిడీ చేసి వారికే పంచేసిన వైనం రాష్ట్రమంతా కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖలో జరిగిన భూసంతర్పణ ఎవరూ మరచిపోరు. 

Image result for chintamaneni on vanajakshi

*తన వారే రాష్ట్రంలో ఇసుక, మైనింగ్, కల్తీ, లైంగిక, కాల్-మనీ, విధ్యా ఆరోగ్య దందాలతో అనేక చీకటి వ్యాపారాలు చేస్తున్నా ప్రజలపై, ఉద్యోగులపై. మహిళలపై అమానుషాలు కొనసాగిస్తున్నా వాటిపై విచారణ లకే ఆదేశాలివ్వని నిరంకుశ ప్రభుత్వాధినేతగా విలసిల్లుతున్నారు చంద్రబాబు.

Image result for no entry for cbi in andhra pradesh

*గుత్తేదార్లు – ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ అత్యధికంగా తన కులజనులకు, బందుజనులకు, పరిజనులకు పార్టీజనులకు ధారాదత్తం చేస్తూ వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం అధికారాన్ని రాష్ట్రంలో వాడేయ్యటమే కాకుండా దేశంలోని ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీలను సమైఖ్యం అంటూ కేంద్రప్రభుత్వంపై సిగ్గు, లజ్జ, నీతి, నియమం, ధర్మం, న్యాయం వదిలేసి బహిరంగంగానే చెసే పనిలో మునిగిపోయారు.

Image result for chandrababu in deep depression

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్ధికంగా అత్యంత వెనుకబడ్డ రాష్ట్రపాలన వదిలేసి భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పార్టీల ఏకీకరణ అనే ఒక కార్యక్రమం పెట్టుకొని ప్రధానిపై వ్యతిరేకతే, ఏకైక అజెండాగా ముందుకు వెళుతున్నారు. రాజ్యాంగ సంస్థలలోని వ్యక్తులపై విభిన్నప్రలోభాలు, కులాభిమానంతో, లేని ప్రేమనటిస్తూ సన్నిహితంగా ఉంటూ వాటితో తన అవస రాలను సాధించటానికి వారీపై నియంత్రణ సాధించటం-ఇదే చంద్రబాబు నాయుడి  తీరని అని ఆయన్ని దగ్గరగా ఎరిగిన వారనే మాటలు. 


నలభైఏళ్ళ సుధీర్ఘ రాజకీయజీవితంలో చంద్రబాబు నిర్మించుకున్న ఒక దుర్బేధ్యమైన రాజకీయ, ఆర్ధిక, సామాజిక వర్గ సంరక్షణ కోసం కట్టుకున్న కోటను ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ పూర్తిగా కూల్చివేస్తాడో అన్నభయంతో దినదినగండంగా వణికిపోతూ – న్యాయ వ్యవస్య్థ లోని కొందరు తన వారీ తోను, దేశంలో ఒక అత్యున్నత పదవిలో ఉన్నతన కులానికే చెందిన ఒక మహనీయుని నీడలో కేంద్రం నుండి వేగంగా సమాచారం అందిపుచ్చుకొని - రక్షణ కవచం ఎప్పటికప్పుడు నిర్మించు కున్నారని ఆయనకు అత్యంత సన్నిహిత వర్గాల నుండి సమాచారం  

Image result for chandrababu in deep depression

దేశంలోనే డబ్బు రాజకీయాల విషయంలో పేరెన్నికగన్న చంద్రబాబు సిసలైన బినామీల బలాన్ని పూర్తి గా నిర్వీర్యం చేసి నరేంద్ర మోడీ దెబ్బతీయనున్నాడా? ప్రస్తుతం అన్ని ప్రశ్నలకూ అవునన్న సమాధాన మే వస్తోంది. ఢిల్లీలో బాబుకు అండగా ఉంటాడనుకున్న పెద్దాయన కూడా నరేంద్ర మోడీ వ్యూహంతో ఏమీ సహాయం చేయలేని పరిస్థితిలో ఇప్పుడు పూర్తిగా హ్యాండ్ ఇచ్చాడట. చంద్రబాబును డైరెక్ట్‌ గా టచ్ చేస్తే 2019ఎన్నికల్లో సానుభూతి అస్త్రంతో ప్రజల ముందుకు వెళ్ళడం ఖాయం కాబట్టి బాబు బినామీలపై దెబ్బకొట్టాలని నిర్ణయించుకున్నారట నరేంద్ర మోడీ.

Related image

2014ఎన్నికల్లో మోడీ ప్రజాధరణను వాడుకుని అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ప్రధానినే దోషిగా నిలబెట్టిన బాబు దుర్మార్గరాజకీయాలను ఊరికే వదలకూడదు అన్నది నరేంద్ర మోడీ భావనగా తెలుస్తోంది. వాడుకుని వదిలేసే నైజం ఉన్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని నరేంద్ర మోడీ చూస్తున్నాడు.

Image result for chandrababu in deep depression

రుణమాఫీలతో సహా ఎన్నో హామీల విషయంలో ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు తనను అడిగే అర్హత ఉందా? అని మోడీ రాష్ట్ర బిజెపి నేతలతో డైరెక్ట్‌గానే అంటున్నాడట. అందుకే 2014ఎన్నికల్లో మోడీ క్రేజ్‌ని వాడుకుని వదిలేసిన బాబుకు బుద్ధి చెప్పడం కోసం చంద్రబాబు బినామీ లందరికీ చుక్కలు చూపించడానికి రెడీ అవుతున్నాడు మోడీ.


2004 ముందు హైటెక్-సిటీ నిర్మాణం సమయంలో లాభపడ్డ ఒక సినిమా నిర్మాత & రాజకీయనాయకుడి నుంచి చంద్రబాబుకు మద్దతుగాఉంటూ కోట్ల రూపాయలు సంపాదించుకోవడం, ఆ తర్వాత ఎన్నికల్లో బాబు గెలుపు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న బినామీలలో ముఖ్యులందరి జాతకాలు మోడీ దగ్గర ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే సాక్ష్యాధారాలు సేకరిం చిన మోడీ పకడ్బందీగా ప్రణాళిక రచించి జనవరి నుండి అరెస్టులు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట.

Image result for chandrababu in deep depression

ఐదేళ్ళ చంద్రబాబు పాలన పూర్తవనుంది చేసిన వాగ్ధానాలన్నీ పెండింగే

ఈ విషయాలపైన అనుమానం, సమాచారం ఉన్న చంద్రబాబు ఇప్పుడు రాజకీయ నాయకులందరినీ కలుస్తూ మద్దతు కోరుతున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడు తున్నారు. పైకి రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్తున్నప్పటికీ అసలు ఉద్ధేశ్యం మాత్రం చంద్రబాబు రాజకీయ స్వార్థం కోసమే ఈ మీటింగులు అని స్పష్టం చేస్తున్నారు.


మీటింగ్‌ల పేరుతో, దేశంకోసం అనే పేరు చెప్పి పాలనను పూర్తిగా గాలికి వదిలేసి, స్పెషల్-ఫైట్స్‌లో నాయకులను కలవడానికి వెళ్తూ ఉండడాన్ని ప్రజలు కూడా విమర్శి స్తున్నారు. చంద్రబాబు రాజకీయ స్వార్థం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నాడన్న అభిప్రాయాలు విని పిస్తున్నాయి.


నారా చంద్రబాబు నాయుడు నీతివంతుడు కాదు. నిప్పు కాదు. నిజాయతీపరుడు కాదు. ఎందుకంటే ఈ గుణాలున్నవారు సిబీఐ ఎంట్రీకి “నో” చెప్పరు కదా! దాన్ని అవకాశంగా తీసుకొని తమ నీతిని, నిజాయితీ ని నిరూపించుకుంటారు. తమలోనిప్పురగల్చటాన్ని జనానికి చూపిస్తారు. తమ సత్యసందతకు ఋజువు లు చూపిస్తారు. ఇవేవీ చంద్రబాబు నాయుడు చేయకపోగా రాష్ట్రంలోకి విచారణ సంస్థల ప్రచారాన్నిఏకంగా నిషేధించారు.

Related image

అంటే తాను చేసిన నేఱాల చిట్ఠా ఎక్కడ బయట పడుతుందోనని రాష్టంపై కేంద్ర ప్రభుత్వం దాడి చేయ నుందని రాష్ట్రప్రజలంతా ఒక్కటై తన చుట్టూ రక్షణ వలయం గా ఏర్పడి తనను రక్షించుకోవాలని అంటు న్నారు చంద్రబాబు. చూస్తుంటే విశ్లేషకుల అభిప్రాయం తప్పు కాదని పిస్తుంది.

Image result for chintamaneni on vanajakshi

అంతేకాదు 20మందికి పైగా ప్రతిపక్ష ఎమెల్యేలను తన పార్టీలోకి చేర్చుకొని పిరాయింపులను ప్రోత్సహించి నేడు తెలంగాణాలో పిరాయింపుదార్లను ద్రోహులు దుర్మార్గు లు అంటున్నాడు. ఏపిలో 600పైగా వాగ్ధానాలు చేసి అందులో 60 కూడా నేరవేర్చని ఈ వాగ్ధానకర్ణుడు తెలంగాణాలో ఎన్నికల్లో చెసే వాగ్ధానాలు పెద్ద జోకులై పోయాయి. ప్రజలలో ఇంతగా చర్చలు జరిగిన దాఖలాలు ఎప్పుడూ లేవు. అయినా ఒక ఆంధ్ర ప్రాభల్యపార్టీ తెలంగాణాలో ఎందుకు? అనేది ఇక్కడి వారి ప్రశ్న.

Image result for no entry for cbi in andhra pradesh

టిడిపితో పొత్తు ఏర్పరచుకొని తన ప్రాబల్యాన్నిప్రాభవాన్ని కోల్పోయింది తెలంగాణాలో కాంగ్రెస్ -. ఓటుకు నోటు కేసులో పరువు, ప్రతిష్ట, సిగ్గూ, శరం, పరిపాలన, అనుచరులను సర్వం పోగొట్టుకొని రాత్రికి రాత్రి బిచాణా ఏత్తేసి అమరావతికి పారిపోయిన చంద్రబాబుకు సిగ్గులేక ఒంటరిగా రాలేక ముందు కాంగ్రెసును నిలబెట్టుకొని వారి వెనక దొంగలాగా దొడ్డిదారిన మళ్ళీ హైదరాబాదులో అడుగుబెట్టాడని అంటున్నారు హబ్సిగూడా వాసులు. అందుకే వారు చంద్రబాబును నిలదీయటంతో మీటింగ్ వదిలేసి అవమానభారంతో వెళ్ళిపోయారు అక్కణ్ణుంచి.

Image result for KCR comments on mental state of chandrababu

ఆయనకు ఒక స్నేహం, న్యాయం, ధర్మం, నిజం, నీతి, నిజాయతీ అనే పదాలన్నా గుణాలన్నా అసహ్యం. అందుకే ఈయన దానాల్లో ముఖ్యమైన అబధాల వాగ్ధానాలతో ప్రపంచంలోనే ప్రథముడు అనవచ్చు. అబద్ధాలాడే అధమాతి అధములలో ప్రధముడనవచ్చు. అంధుకే "వాగ్ధానకర్ణ" అని బిరుదిచ్చి సత్కరించటానికి సరైన వ్యక్తిగా తెలంగాణావాసులు గుర్తించారు.

Related image

కన్నా లక్ష్మినారాయణ మాట్లాడుతూ - చంద్రబాబు ఆయన బృందం అంత నీతిమంతులైతే రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా ఎందుకు అడ్డుకుంటు న్నారని ప్రశ్నించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఆరోపణలు వస్తే ఆయన స్వయంగా సీబీఐ దర్యాప్తుకు సిద్ధపడ్డారని గుర్తుచేశారు. లోకేశ్‌కు, చంద్రబాబుకు ధైర్యముంటే సీబీఐ దర్యాప్తు చేయించుకొని నిజాయతీ నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. 2014ఎన్నికల్లో సోనియాగాంధీపై అనేక ఆరోపణ లు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆమెతో చేతులు కలిపి కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటు కాదా! అని విమర్శించారు.

Related image

ఐదేళ్ళ చంద్రబాబు పాలన పూర్తవనుంది చేసిన వాగ్ధానాలన్నీ పెండింగే

నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన నగరం హైదరాబాద్, అలాంటి మహానగరాన్ని మరొకరు ప్రపంచపటంలో పెట్ట నవసరం లేదు. కాని నారా చంద్రబాబు హైదరాబాద్ ను ప్రపంచ చిత్రపటంలో పెట్టానంటూ కల్లబొల్లి కబుర్లు చెపుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ ను ప్రపంచపటంలో పెట్టిన నువ్వు మరి కరెంటును అప్పుడు ఎక్కడ దాచి పెట్టవని కేటీఆర్ ప్రశ్నించారు.


Ref: సైబరాబాద్ నిర్మాణ ఘనత పివి ది - ఆచరణ నేదురుమల్లి - చంద్రబాబు, వైఎస్ లు కొనసాగించారు అంతే!

https://www.apherald.com/Politics/ViewArticle/326808/telangana-news-ap-news-builder-of-cyberabad-%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D/

తానే సైబరాబాద్ నిర్మించానని డబ్బా కొట్టుకోవటమంత నైచ్యం ఇంకేమీలేదు. సార్వభౌమరాజ్యాల్లో నగరాల నిర్మాణం అంతఃపుర నిర్మాణాలుంటాయి. ప్రస్తుత ప్రజాస్వామ్య యుగంలో పరిపాలనకు అవసరమైన నగర నిర్మాణాలే ప్రభుత్వాలు పాలకులు చూస్తారు. మిగతాదేదైనా జరిగితే అవి ప్రయివేట్ భవనసముదాయాలు మాత్రమే. దాన్ని మనం రియల్ఎస్టేట్ క్రింద మాత్రమే పరిగణిస్థాం. అలాచెసే అమరావతికి కేంద్ర నిధులు రావటం లేదనటం ప్రజాస్వామ్య యుగం లో పద్దతి కాదు.రేపు ఎప్పుడైనా కాంగ్రెస్ కూడా ఇదేచెప్పి తప్పించుకుంటుంది. ఏప్రభుత్వమూ ప్రజాస్వామ్యంలో నగరాలు నిర్మించదు. నిర్మిస్తే అది రియల్-ఎస్టేట్ వ్యారమని మాత్రమె చెప్పొచ్చు.   


చట్టం రాజ్యాంగం అంగీకరించని వాగ్ధానాలు చేసి, వాటిని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి పంపేసి - కేంద్రం సహకరించలేదని అనటం చంద్రబాబుకు అలవాటు.

Image result for chandrababu in deep depression

నేడు ఏపి అఙ్జాని మూర్ఖుడు బాలకృష్ణ మాట్లాడుతూ ఫ్లై-ఓవర్లు, భవనాలు కూల్చేయమని అనటం, ఏయిర్ పోర్ట్ మూసేయ్యమనటం అరాచకవాదానికి నిదర్శనం. అవి నిర్మించింది చంద్రబాబు సొమ్ముతోనో బాలకృష్ణ సొమ్ముతోనో కాదు, ప్రజాధనంతో. మీరెవరు కూల్చటానికి. అయినా ఎంతటి నికృష్టుడైనా తానే నిర్మించామని చెపుతున్న నిర్మాణాలను కూల్చేయమని ప్రజలకు చెప్పరు కదా!  తెలుగువారు కట్టిన పన్నులతో దోచేసినంత దోచేసి మిగిలిన తడితో కట్టిన భవనాలే కూల్చమంటే తెలంగాణావాసులు చర్మం వలిచేస్తారని బాలకృష్ణను హెచ్చరిస్తున్నారు శేరిలింగంపల్లి వాసులు.


అయినా ఎవడో నిర్మిస్తే అందులో బ్రతకటానికి హైదరాబాద్ వాసులు అనాధలు కాదు. అది ప్రజాధనం, నారావారో, నందమూరివారో, గాంధిగారో కట్టించిన వంటే - దానికి ముందు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోగా అదృష్టం మీకు లభించింది. ఏనాటికీ అది మీరు కట్టించినవంటే కర్రుకాల్చి తెలంగాణా వాళ్ళు వాతలు బెడతారు అంటున్నారు బోయినపల్లి వాసులు. ఈ బాలకృష్ణ సొంత సొమ్మెదైనా ఖర్చుచేస్తే నేను కట్టించాననే మాటలు మాట్లాడాలని ఢంకా బజాయించి చెపుతున్నారు.

Image result for narendra modi vs chandrababu naidu

చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి రావటంతో టీఆరెస్ గెలుపు అవకాశాలు ఇప్పుడు మెరుగైనాయి. కాంగ్రెస్ ఈ మద్య చేస్తున్న ప్రచారాలు, పేపర్లలో ఇచ్చిన ప్రకటనలు చూస్తుంటే ఆ మహకూటమి పార్టీలు ఎంత ధారుణ మానసిక మాంధ్యం (డిప్రెషన్) తో కూడిన వత్తిడితో ఎంతగా కొట్టుమిట్టాడుతున్నారోనని విఙ్జులు అభిప్రాయపడుతున్నారు.  అది నిజమే అనేలాగా చంద్రబాబు కూకట్ పల్లి రోడ్-షోలో మాట్లాడుతూ ‘‘ఆరు నెలల్లో మళ్లీ పార్లమెంటు ఎన్నికలు వస్తాయి. రేపు మీరంతా ఓట్లేసి ప్రజాకూటమిని గెలిపిస్తే, సునాయాసం గా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి……’’ అంటూ తన మనసులో నిజంగా ఉన్న మాటవెలువరించారు  దీన్ని గమనించిన కెసీఆర్ చంద్రబాబు మనస్థిని ఏదైనా ఆసుపత్రిలో చంద్రబాబును చేర్పించటం మంచిదని అంటున్నారు.

Image result for KCR comments on mental state of chandrababu

ఈవిఎంల గుఱించి మాట్లాడుతూ, ఈవిఎంలలో మోసాలు జరగొచ్చనేది తెలంగాణా ఎన్నికల సందర్భంగా చంద్రబాబు కొత్త ఆరోపణ.  చంద్రబాబు! మీరు, మీ పార్టీ గెలిచిన ఎన్నికల సమయంలో వినియోగించిన ఈవిఎంలలో లోపాలు ఉన్నట్లేనా? అప్పుడు మీ గెలుపు ప్రశ్నార్ధకం కాదా? మరప్పుడు ఎందుకు ఈ అభియోగం చెయ్యలేదు? మీరు చేస్తే నీతి, నిజాయతీ. అదే తప్పు వేరే వాళ్లు చేస్తే మోసం దగా? ఇదేమి న్యాయం? చంద్రబాబు!

Image result for KCR comments on mental state of chandrababu 

మరింత సమాచారం తెలుసుకోండి: