తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి కనిపిస్తుంది.  పార్టీ నేతలు ముమ్మర ప్రచారాలు కొనసాగిస్తున్నారు.  అధికార పార్టీ తాము చేసిన అభివృద్దే తమను గెలిపిస్తుందని నమ్మకంతో ఉండగా..టీఆర్ఎస్ ని ఎలాగైనా ఈసారి మట్టి కరిపించాలని మహాకూటమి రంగంలోకి దిగింది.  ఇక బీజేపీ నుంచి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ రెండు పర్యాయాలు పర్యటించిన విషయం తెలిసిందే.
Image result for telangana elections
ఇదిలా ఉంటే..తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల సిబ్బంది నియామకంపై ఈసీ దృష్టిపెట్టింది. డిసెంబర్ 7వ తారీఖున జరిగే ఎలక్షన్స్ కోసం ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు నలుగురు సిబ్బందిని నియమిస్తామని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.  రాష్ట్రంలో మొత్తం 32 వేల 574 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 217 కొత్త పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 32,851 కి చేరింది.
Image result for telangana elections
ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు నలుగురు చొప్పున సిబ్బందిని నియమిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది.  కాగా, 32,851 పోలింగ్ స్టేషన్లకు నలుగురు చొప్పున  1,31,404 మంది సిబ్బంది అవసరం అవుతారని ఎలక్షన్ కమిషన్ తెలిపింది.  ఈ నేపథ్యంలో   డ్యూటీలో నియమించే సిబ్బందికి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఈసీ ప్రకటించింది. సిబ్బందికి జిల్లా కలెక్టర్లు ఆధ్వర్యంలో ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేస్తామని ఎలక్షన్ కమిషన్ అధికారులు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: