సోమవారం సాయంత్రం టీవీ9లో ప్రసారమైన సీపీఎస్ సర్వే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో కలకలం సృష్టించింది. ఈ సర్వేలో టీఆర్ఎస్ కు 100 నుంచి 104 సీట్ల వరకూ వస్తాయని తేలింది. ప్రతిపక్ష ప్రజాకూటమికి 21 కంటే ఎక్కువ సీట్లు రావని తేల్చింది. మజ్లిస్ కు 7 స్థానాల వరకూ వస్తాయని ఆ సంస్థ ప్రకటించింది. ఐతే.. టీవీ9లో ఈ సర్వే ప్రకటించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది.



ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ ముందు రోజు వరకూ ఏ సంస్థ అయినా సర్వేలు ప్రకటించడం నిషిద్దం. అయినా పలు మీడియా సంస్థలు ఈ నిబంధనలు అంతగా పట్టించుకోవడం లేదు. ప్రత్యేకించి కొన్ని రోజులుగా నేషనల్ ఛానళ్లు పలు సర్వేలు ప్రకటించాయి. వీటిలో అత్యధికం టీఆర్ఎస్ దే మళ్లీ విజయం అని చెప్పాయి.

Image result for INDIA TODAY SURVEY ON TELANGANA


ఐతే.. ఇటీవలి కాలంలో ప్రజాకూటమి పుంజుకోవడంతో కూటమి విజయం ఖాయమంటూ కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇదే సమయంలో లగడపాటి రాజగోపాల్ తెలంగాణలో ఇండిపెండెంట్లు ఎక్కువగా గెలుస్తారని ప్రటించారు. లగడపాటి ప్రకటనపై టీఆర్ఎస్ మండిపడింది. సాక్షాత్తూ కేసీఆర్ కూడా వెర్రిమొర్రి సర్వేలు చేస్తున్నారు. సొంత మీడియాలో హడావిడి చేస్తారని ఎన్నికల సభల్లోనే చెప్పారు.




సర్వేను సర్వేతోనే దెబ్బ తీయాలన్న ఉద్దేశ్యంతోనే కేసీఆర్ టీవీ9లో అనుకూల సర్వే వచ్చేలా చేశారని కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇటీవల టీవీ9 ను మైహోమ్ రామేశ్వరరావు కొనుగోలు చేసినందువల్ల ఆయన ద్వారా కేసీఆర్ ఒత్తిడి తెచ్చారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఈమేరకు తమకు సమాచారం ఉందని ఆయన టీవీ9కి ఇచ్చిన ఫోనోలోనే చెప్పారు. కేసీఆర్ ఓటమి భయంతోనే తప్పుడు సర్వేలు ప్రచారంలోకి తెస్తున్నారంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: