ఆత్మవిమర్శ చేసుకున్నాడో, జ్ఞానోదయం కలిగిందో లేక అవసరార్థమో గాని ‘ప్రజాగాయకుడు’ గద్దర్ ప్రజల్లో ‘ఓటు చైతన్యం’ తెస్తానని బయలుదేరాడు.  ఈ నేపథ్యంలో భార్యా సమేతంగా ఢిల్లీకి వెళ్లి సోనియా, రాహుల్ గాంధీలను కూడా కలిశారు.  గత కొంత కాలంగా ‘బుల్లెట్’ మార్గంలో చాలా దూరం ప్రయాణించిన గద్దర్ ఇప్పుడు ప్రజాస్వామ్య బద్దంగా నడవాలని చూస్తున్నారు. ఇప్పుడు ప్రజల్లో ఓటు చైతన్యం కలిగిస్తానని ఆయన ముందుకొచ్చినందుకు సంతోషమే.

అయితే చైతన్యం కలిగించాల్సింది బుల్లెట్ దారిలో కాదు బ్యాలెట్ దారి అని నమ్మినందకు ప్రజలు, రాజకీయ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  తాజాగా ప్రజాగాయకుడు గద్దర్ తొలిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. డెబ్బై ఏళ్ల వయసులో తాను తొలిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నట్టు చెప్పారు. మెదక్ జిల్లా తూప్రాన్ లోని తన తల్లిదండ్రుల సమాధి వద్ద ఆయన నివాళులర్పించారు. 

ఆ తర్వాత విలేకరుల సమావేశంలో డెబ్బై ఏళ్ల తర్వాత తన ఓటును రిజిష్టర్ చేసుకున్నానని అన్నారు. ఎన్నికల ద్వారా పేదవాడికి ఏం ప్రయోజనం కలిగిందని, ‘ఓటు’ ఎందుకు వేయాలని గతంలో తాను ప్రశ్నించానని, అయితే, ఆ పరిస్థితి నుంచి విముక్తి పొందాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన  ‘ప్రజలారా, ఓట్ల చైతన్యం తీసుకురండి, ఓటు హక్కును వినియోగించుకోండి’ అని పిలుపు నిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: