తెలంగాణలో పోలింగ్ జోరుగా సాగుతోంది. అదే సమయంలో కొన్ని చోట్ల అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకీ, బీజేపీ నాయకులకూ మధ్య వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకున్నాయి. దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.



కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్త్జీవంశీ పై బీజేపీ కార్యకర్తల దాడి అమానుషం.. అప్రజాస్వామ్యం.. అంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఓటమి భయంతో టిఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఇలాంటి దాడులు చేస్తున్నారని విమర్శించారు. గురువారం తాండూరులోనూ రోహిన్ రెడ్డి పై ఇలాగే అధికార పార్టీ దాడికి పాల్పడిందని ఉత్తమ్ ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ పైన కూడా టిఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేశారని ఉత్తమ్ తెలిపారు.



ప్రస్తుతం తెలంగాణలోని వోటింగ్ సరళి చూస్తుంటే రాష్ట్రంలో ప్రజా కూటమి విజయం స్పష్టంగా కనిపిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ ఎస్ చేసే ఇలాంటి దాడులకు కాంగ్రెసు భయపడదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యకర్తలంతా మనో ధైర్యంతో ఉండాలని పిలుపు ఇచ్చారు. ప్రజా కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమైందని.. ఉత్తమ్ కుమార్ రెడ్ది ధీమాగా చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: