తెలంగాణలో హంగ్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అందుకే కాస్త ముందు జాగ్రత్త పడుతున్నారు ప్రజాకూటమి నేతలు. తాము తప్పుకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బయటకు దీమాగా చెబుతున్నా.. వారిని కూడా హంగ్ భయం వెంటాడుతోంది. అందుకు ముందస్తుగానే ప్రిపేరవుతున్నారు.

Image result for kcr vs praja kutami

ఇందుకు వారు అన్ని సమీకరణాలను వాడుకుంటున్నారు. ప్రత్యేకించి రెడ్డి కులం కార్డును బయటకు తీస్తున్నారు. టీఆర్ఎస్ తరుపున గెలిచే రెడ్డి ఎమ్యెల్యేలను ముందస్తుగానే టచ్ లో ఉంచుకుంటున్నారు. గతంలో కేసీఆర్ తెలంగాణలో కమ్మ సామాజిక వర్గాన్ని చేరదీసి రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారన్న వాదన ఉంది.

Related image

అంతే కాకుండా తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానిదే మొదటి నుంచి అధికారం. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న ఈ సామాజిక వర్గం ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకే ఇటీవలే టీఆర్‌ఎస్ నుంచి ఓ రెడ్డి ఎంపీ కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు గులాబీ రెడ్డి అభ్యర్థులతోనూ ఆయనే టచ్ లో ఉంటున్నారట. ప్రజాకూటమి 50కి పైగా సీట్లు సాధిస్తే.. ఓ పది మంది రెడ్డి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వైపు లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. చూడాలి ఏం జరుగుతుందో.. ?


మరింత సమాచారం తెలుసుకోండి: