తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఫలితాలపై అందరి చూపు ఉంది. మొదటి నుంచి అధికార పార్టీ టీఆర్ఎస్ జోరు కొనసాగిస్తూ వస్తుంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న మహాకూటమిపై భారీ దెబ్బ పడుతుంది. మహామహులు సైతం దారుణమైన ఓటింగ్ పోల్ అవుతుంది. ఇక తతెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి ఫలితం వెల్లడి అయింది.

చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ గెలుపొందారు. ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని సయ్యద్ షహజాదీ ఓటమి పాలైంది.1999, 2004, 2009, 2014 నుంచి కూడా చాంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్ గెలుపొందారు.

 అక్బరుద్దీన్ గెలుపుతో ఎంఐఎం కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. కనీసం 7 స్థానాలు గ్యారెంటీగా గెలుస్తుందని భావించిన ఎంఐఎం ప్రస్తుతం 3 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది.   పాతబస్తీలోని 5 నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు. అక్బరుద్దీన్ మెజారిటీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గోషా మహల్, యాకుత్ పురాలో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: