ఏడాదిన్నర తర్వాత సీతారామ ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. సిన్సియర్ గా సాగు నీటి ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తాం. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ లు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయి?  ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీలన్నింటిని త్వరలోనే భర్తీ చేస్తాం.  పంచాయితీరజ్ వ్యవస్థ కేంద్రం చేతిలో ఎందుకు? కాంగ్రెస్, బీజేపీ లు పోతేనే ఫ్యూడల్ వ్యవస్థ అంతమవుతుంది.  నిరుద్యోగ భృతి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తాం. జర్నలిస్టుల సంక్షేమంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడేలా చూస్తాం.

ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం మంచిదే. కేంద్రం తాను చేయాల్సిన పని చేయకుండా రాష్ట్రాలపై పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తుంది.  రాష్ట్ర, జిల్లా స్థాయి జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు. దేశానికి ఒక కొత్త ఆర్థిక, వ్యవసాయ విధానం అవసరం.  బీజేపీ-కాంగ్రెస్ దొందూ..దొందే.  మంత్రి వర్గంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం.

జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే రైతు బంధు పథకాన్ని దేశమంతటా అమలు చేస్తాం.  ఓట్ల కోసం జాతీయ నేతలు అబద్దాలు ఆడుతున్నారు.  కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా రాష్ట్రానికో పాలసీ ఉంటుంది.  సీపీఎస్ పై కాంగ్రెస్ ది ద్వంద్వ విధానం కొనసాగుతుంది.  రైతుల పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. అనేక దేశాలు రైతులకు పూర్తిగా సహకారాన్ని అందిస్తున్నాయి.

నూరు శాతం మానిఫెస్టోలో ఉన్న అంశాలు అమలు చేసే ప్రభుత్వం మాది. మేం ప్రజలకు ఏం చెప్పామో అదే అమలు చేస్తాం. అంతేందుకు మేనిఫెస్టో లో లేని అంశాలు కూడా కొన్ని అమలు చేశాం.  కంటి పరీక్షలు చేసుకున్నవారు కోటి దాటారు. కంటి వెలుగు లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేదు..ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు తర్వాత రైతుబంధు దేశమంతా ఇస్తాం మని కేసీఆర్ మీడియా సమావేశంలో తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: