ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం కొన్ని పార్టీలు సంతోషంలో మునిగిపోతుంటే మరికొన్ని మాత్రం విషాదంలో ఉండిపోయాయి. తెలంగాణలో కాంగ్రెస్ తో కూటమి కట్టి తీవ్ర పరాభవాన్ని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ నిన్నటిదాకా విషాదంలోనే ఉండిపోయింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ఆ పార్టీ నేతలు కూడా సంతోషంగా కనిపిస్తున్నారు.. ఇంతకూ కారణమేంటో తెలుసా..?

         Image result for tdp

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ.. తదితర పార్టీలన్నీ కూటమికట్టి పోరాడినా కేసీఆర్ ను ఓడించలేకపోయారు. అటు బీజేపీ కూడా ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఎంఐఎం మాత్రమే తమ సీట్లను కాపాడుకోగలిగింది. అన్నిపార్టీలూ టీఆర్ఎస్ ను ఓడించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా టీఆర్ఎస్ హవాను ఏమాత్రం తగ్గించలేకపోయింది. పైగా కేసీఆర్ కు మరింత బలాన్ని అందించాయి. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో ఉద్యమం వేడి బలంగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ కు 63 సీట్లు మాత్రమే వస్తే.. ఈ దఫా ఏకంగా 88 సీట్లు వచ్చాయి. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఆయనకు ఈ విజయం అందించాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

 Image result for tdp

          ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఈ అంశాలే సరికొత్త జోష్ నింపుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలవల్లే ఆయన్ను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చాయనేది టీడీపీ అంచనా. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువైతే, వాటి ఫలాలు అందితే.. ఓటర్లు తప్పకుండా మళ్లీ అధికారంలో కూర్చోబెడతారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. గతంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి రెండోసారి అధికారంలోకి రావడానికి కూడా నాడు ఆయన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలేననేది ఆ పార్టీ విశ్లేషణ. ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు ఎవరు ఎంత డబ్బిచ్చినా, ఎన్ని మాయమాటలు చెప్పినా నమ్మరని, మళ్లీ అధికారంలోకి కూర్చోబెడతారని భావిస్తున్నారు.

 Image result for tdp

          గత నాలుగున్నరేళ్లుగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని టీడీపీ నేతలు చెప్తున్నారు. రుణమాఫీ, పెన్షన్లు, నిరుద్యోగభృతి, అన్న క్యాంటీన్లు, రైతురథాలు, ఎన్టీఆర్ గృహాలు.. ఇలా ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇంట్లో ప్రతి ఒక్కరికీ నెలకు కనీసం రూ.10 వేల రూపాయల మేర లబ్ది చేకూరేలా తమ కార్యక్రమాలున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఈ పథకాలే తమను తిరిగి అధికారంలో కూర్చోబెడతాయని అంచనా వేస్తున్నారు. కేంద్రం సహకరించకపోయినా, రాష్ట్రంలో ప్రతిపక్షం ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను మాత్రం ఆపలేదని .. కచ్చితంగా ప్రజలు తమ పట్ల కృతజ్ఞత చూపిస్తారని భావిస్తున్నారు. అందుకే తెలంగాణ ఎన్నికల తర్వాత టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. మరి వారి ఉత్సాహం ఏమేరకు ప్రభావం చూపిస్తుందో వేచి చూద్దాం..


మరింత సమాచారం తెలుసుకోండి: