ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల తరచూ మాటలు మారుస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. పాపం చంద్రబాబు చెప్పే మాటలు కూడా అలాగే ఉంటాయి. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఆయన మొదట కేసీఆర్‌ పార్టీతో పొత్తు పెట్టుకుందామనుకున్నాడట. ఆ విషయం కేసీఆర్ వద్ద ప్రస్తావించాడట. పాపం చంద్రబాబు పెద్ద మనసును కేసీఆర్ అర్థం చేసుకోలేకపోయాడు.

Image result for chandrababu kcr


టీడీపీతో పొత్తుకు గులాబీ బాస్ ససేమిరా అన్నాడు. పాపం ఇక చంద్రబాబు ఏం చేస్తాడు.. ఉన్న ఆప్షన్ ఒక్కటే.. కాంగ్రెస్ తో పొత్తు కట్టడం.. ఏ పొత్తూ లేకుండా ఒంటరిగా బరిలో దిగొచ్చుగా అంటారా.. అలా చేస్తే ఇక ఆ పార్టీ తెలంగాణలో కనుమరుగే కదా. అందుకే ప్రజా కూటమి కట్టాడు చంద్రబాబు. పాపం ఆ ప్రయత్నం అట్టర్‌ ఫ్లాప్ అయ్యింది. మళ్లీ తెలంగాణలో గులాబీ జెండా ఎగిరింది. దీన్ని చంద్రబాబు ఫెయిల్యూర్ గా చూడటం టీడీపీ అధినేత తట్టుకోలేకపోతున్నారు.

Image result for chandrababu kcr


తెలంగాణలో టీఆర్‌ఎస్ గెలిస్తే ఆంధ్రాలో వైసీపీ, జనసేన సంబరాలు చేసుకోవడమేంటని ఇప్పుడు చంద్రబాబు ఆ పార్టీలపై ఎదురుదాడి చేస్తున్నారు. అంతేనా.. ప్రత్యేక హోదాకు అడ్డుపడుతున్న కేసీఆర్ తో మీకు దోస్తీ ఏంటని నిలదీస్తున్నాడు.. అదేంటి.. మొన్నటి వరకూ మీరు కూడా కేసీఆర్ తో దోస్తీ కోసం ప్రయత్నించారు కదా.. ఇప్పుడు ఏంటి మీకు ఇలా మాట్లాడే అర్హత ఎక్కడిదని అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

Image result for chandrababu jagan pawan


దీనికి చంద్రబాబు అదిరిపోయే లాజిక్ చెబుతున్నారు. నేను కేసీఆర్ తో దోస్తీ చేద్దామనుకున్న సమయానికి గులాబీ పార్టీ ప్రత్యేక హోదాకు అనుకూలంగానే ఉంది. కానీ ఇప్పుడు కేసీఆర్ ఏపీకి ప్రత్యేక హోదా ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు. మరి ఇప్పుడు అతనితో మీరు ఎలా దోస్తీ చేస్తారు అని లాజిక్ లాగుతున్నారు. అదీ పాయింటే కదా.. అబ్బో చంద్రబాబు లాజిక్ చూస్తే దిమ్మతిరిగిపోవడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: