తెలుగు రాష్ట్రాలు చాలా అన్యాయంగా విభజించారని..అన్ని అభివృద్ది అయిన రాష్ట్రం ఒకటి..ఇప్పుడిప్పుడే పునాదులు వేసుకునే పరిస్థితిలో మరో రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేశారని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు.  తెలుగు రాష్ట్రాలు విభజన జరగడం తనకు అభ్యంతరం లేకున్నా..ఏపికి మాత్రం చాలా అన్యాయం చేశారని అంటున్నారు. 

ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి యేటా కొత్త సంవత్సరాలనికి స్వాగతం పలుకుతూ..ప్రజలు సంబరాలు చేసుకుంటారని..అయితే ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన బీజేపీ, దానికి సహకరిస్తున్న ఇతర పార్టీల గుండెల్లో వణుకు పుట్టేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఇందుకోసం జనవరి 1న కొత్త సంవత్సరం వేడుకల స్థానంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ భారీగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
Image result for new year 2019 celebrations india
సాధారణంగా కొత్త సంవత్సరం రోజున సంబరాలు చేసుకుంటామని, అయితే, కేంద్రం చేసిన అన్యాయంపై ఈసారి జనవరి 1న గళమెత్తాలని సూచించారు. రాష్ట్రం నుంచి గ్రామ స్థాయి వరకు ప్రజలు కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ఇస్తామంటేనే నాలుగేళ్లు ఎన్డీయేలో ఉన్నామని..ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చాక ఎన్టీయే నుంచి బయటకు వచ్చామని..ఆ తర్వాత రాష్ట్రంపై కేంద్రం మరింత వివక్షత చూపిస్తుందని చంద్రబాబు అన్నారు.  అందుకే  రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ర్యాలీలు నిర్వహించాలని చంద్రబాబు కోరారు. తొలుత ఒకరు నిరసన తెలిపితే వారి వెంట కలిసి వచ్చే వాళ్లు మరికొందరు ఉంటారని, అలా అది ప్రవాహంగా మారుతుందని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: