అవును బి. గుర్నాధరెడ్డి గురించి చెప్పాల్సొస్తే అలాగే చెప్పాలి. ఎందుకంటే, గుర్నాధరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఎంఎల్ఏ అయ్యారు. తర్వాత మారిన రాజకీయ పరిస్ధితుల్లో కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసి వైసిపిలో చేరారు. వైసిపి నాయకత్వంతో విబేధించి తెలుగుదేశంపార్టీలో చేరారు. తాజగా అంటే ఈరోజు మళ్ళీ టిడిపికి రాజీనామ చేసి తిరిగి వైసిపిలో చేరారు. అంటే గుర్నాధరెడ్డికి ఒక ప్లనంటూ లేకుండా బొంగరం తిరిగినట్లు తిరుగుతున్నారు పార్టీల మధ్య. ఇంతకీ విషయం ఏమిటంటే, అనంతపురం మాజీ ఎంఎల్ఏ బి. గుర్నాధరెడ్డి వైసిపిలో బాగానే ఉండేవారు. ఎందుకేంట, వైఎస్ కుటుంబంతో గుర్నాధరెడ్డి కుటుంబానికి మంచి సంబంధాలే ఉన్నాయి.

 

వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు విషయంలో మాజీ ఎంఎల్ఏకి అనుమానాలు వచ్చినట్లుంది. దాంతో జగన్ తో విబేధించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా జరిగారు. విషయం గ్రహించిన అనంతపురం టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి మాజీ ఎంఎల్ఏకి గాలం వేశారు. తెలుగుదేశంపార్టీలో చేరితే మంచి పోస్టు ఇప్పించటంతో పాటు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కూడా ఇప్పిస్తానని జేసి హామీ ఇచ్చారట. దాన్ని నమ్మిన గుర్నాధరెడ్డి ముందు వెనుక ఆలోచించకుండా టిడిపిలో చేరిపోయారు. సరే పార్టీలో చేరేంత వరకే ఎవరికైనా గుర్తింపు ఉంటుంది టిడిపిలో. ఆ తర్వాత అంతే సంగతులన్న విషయాన్ని మాజీ ఎంఎల్ఏ మరచిపోయారు.

 

అందూ అనుకున్నట్లే జరిగింది. పార్టీలో చేరేముందున్న ప్రాధాన్యత గుర్నాధరెడ్డికి చేరిన తర్వాత దక్కలేదు. దాంతో మొదటికే మోసం వచ్చింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు సంగతి దేవుడెరుగు అసలు పార్టీలో గుర్తింపు కూడా దక్కలేదు. దాంతో ఏం చేయాలో గుర్నాధరెడ్డికి దిక్కుతోచ లేదు. అదే సమయంలో జగన్ పై హత్యాయత్నం జరిగింది. అదే అవకాశంగా తీసుకున్న మాజీ ఎంఎల్ఏ నేరుగా ఇంటికే వెళ్ళి జగన్ ను పరామర్శించారు. అప్పట్లో ఆ ఘటన టిడిపిలో కలకలం రేగింది. మొత్తానికి షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో టిడిపి నేత మళ్ళీ ఈరోజు గుర్నాధరెడ్డి జగన్ సమక్షంలో తిరిగి వైసిపిలో చేరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: