దర్యాప్తు సంస్థలు అధికార పార్టీల చేతుల్లో కీలుబొమ్మలవుతున్నాయన్న విమర్శలు కొత్త కాదు. దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ కొట్టడమూ కొత్త కాదు. ఉదాహరణకు ఓటుకు నోటు కేసు చంద్రబాబును భయపెడుతోంది. తాజాగా ఈ విషయంలో ఇద్దరు చంద్రులకూ వాదనలు కూడా జరిగాయి.



ఓటుకు నోటు కేసులో ఇక కేసీఆర్ చేసేదేమీలేదన్న అభిప్రాయానికి తెలుగు దేశం నేతలు కూడా వస్తున్నారు. అందుకే ఏం పీక్కుంటావో పీక్కో అంటూ సవాళ్లు విసురుతున్నారు. ఇదే సమయంలో అన్నిరోజూలూ మనవే అన్న ధీమా కూడా మంచిది కాకపోవచ్చు. ప్రస్తుతం అన్నివిధాలా సేఫ్‌ జోన్‌లో ఉన్న టీఆర్‌ఎస్ ఛీఫ్ కేసీఆర్‌కు రోజులు ఇలాగే ఎప్పటికీ ఉండకపోవచ్చు.



ఇప్పటికీ మూడు రాష్ట్రాల్లో బీజేపీ దెబ్బ తిని ఉంది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే ఫలితాలు రిపీటైతే రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమవుతుంది. అప్పుడు కేంద్రంలోని కాంగ్రెస్ కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు పరపతి అమాంతం పెరుగుతుంది. అదే జరిగితే కేసీఆర్ చిక్కుల్లో పడవచ్చు.



కేంద్రంలో కాంగ్రెస్ వస్తే.. కేసీఆర్ పై ఉన్న పాత కేసులను తిరగతోడవచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసు, వెలుగుబంటి సూర్యనారాయణ కేసు, సహారా ఆస్తుల కేసు.. ఇలాంటివి కేసీఆర్ ను ఇబ్బంది పెట్టవచ్చు. ఈ మేరకు ఇప్పటి నుంచే తెలుగుదేశం నేతలు కేసీఆర్ కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: