గత సంవత్సరం అక్టోబర్ మాసంలో వైసీపీ అధినేత జగన్ పై విశాఖపట్టణం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం విషయం రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశంలోనే సంచలన విషయం అయ్యింది.

Image result for jagan attack high court

ఈ క్రమంలో జగన్ పై జరిగిన హత్య యత్నం కేసు విషయమై ఇటీవల హైకోర్టు ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ అయిన ఎన్ ఐ ఎ కి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ పొన్నవోలు సుధాకరరెడ్డి చెప్పారు.

Image result for jagan attack high court

న్యాయం సాదించడంతో తమ పార్టీ విజయం సాదించిందని ఆయన అన్నారు. విమానాశ్రయాలలో ఇలాంటి ఘటనలు జరిగితే కేంద్ర దర్యాప్తు సంస్థలు చేపట్టవలసి ఉందని చట్టం చెబుతోందని, దానిని పక్కదారిన పట్టిస్తూ రాస్ట్రం సొంతంగా విచారణ చేపట్టిందని ఆయన అన్నారు.

Related image

తమ వాదనలో సత్యం ఉండబట్టే కోర్టు తమ డిమాండ ను అంగీకరించిందని సుధాకరరెడ్డి అన్నారు.మంగళగిరి వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిసన్ వేశారు.కాగా దీనిపై సుప్రింకోర్టుకు అప్పీల్ కు వెళతామని ఎపి ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే ఈ దాడి గురించి అధికార మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆంధ్ర రాజకీయాలలో పెద్ద చర్చనీయాంశం అయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: