ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ నాయకులు తీరు వేరేగా ఉంటుంది. వారి మాటలు, చేతలు కూడా ఒక్కసారిగా మారిపోతాయి. ఎన్నడూ చూడని విధంగా వారి వైఖరి ఉంటుంది. సమస్త సమస్యలు వారికి అపుడే కనిపిస్తాయి. అందరి   పైనా వారి చూపు పడుతుంది. మరి జనం వీటిని ఎలా చూస్తారు.


క్రెడిట్ కొట్టేసిన బాబు:


వైఎస్ జగన్ పాదయాత్రలో ఊరూరా తిరిగి చేసిన హామీలు ఇపుడు అధికారంలో ఉన్న చంద్రబాబు  ఒక్క దెబ్బతో  అమలు  చేసేస్తున్నారు. సంక్రాంతి కానుక ఆంటూ ఆయన లేటెస్ట్ గా ప్రకటించిన న రెట్టింపు పించన్లు జగన్ పార్టీకి షాక్ లాంటివే. వ్రుద్ధులకు, పేదలకు ఇస్తున్న నెలకు వేయి రూపాయలను రెండు వేలు చేస్తూ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అలాగే దివ్యాంగులకు కూడా ఏకంగా మూడు వేల రూపాయలకు పించను పెంచేశారు. 
జనవరి నుంచే ఈ పెంపు అమలవుతుందని కూడా బాబు ప్రకటించారు. ఇదిపుడు ఎన్నికల తాయిలంగానే చూసినా ఏపీలోని నిరు పేదలు, వ్రుద్ధులకు భారీగానే లబ్ది కలిగించే పరిణామమే. ఇకపోతే ఈ పధకాలకు ఎంతటి ఆసక్తి ఉందంటే పొరుగు రాష్ట్రంలో కేసీయార్ వీటినే నమ్ముకుని అక్కడ బంపర్ మెజారిటీతో గెలిచారు.  బాబు సైతం ఇదే మార్గం అనుసరించడం ద్వారా రేపటి ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు.


జగన్ హామీ అలా :


జగన్ తాను అధికారంలోకి వస్తే ఈ వర్గాల పించనులు రెట్టింపు చేస్తామని ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. మరి ఇపుడు అధికారంలో ఉన్న చంద్రబాబు వాటిని అమలు చేసి చూపించారు. దీంతో జగన్ వద్ద ఉన్న కీలక‌మైన ఆస్త్రాలు ఆ విధంగా బాబు వైపుగా మళ్ళినట్లవుతోంది. ఈ సామాజిక పించన్ల ప్రభావం ఎన్నికల్లో చాలా ఎక్కువ. వాటిని పొందుతున్న వారు తమ ధన్యవాదాలను  చెప్పడానికైనా తప్పకుండా
ఓటు వేసి తీరుతారు. ఓ విధంగా ఇది అధికార తెలుగుదేశం పార్టీకి ఎంతో మేలు చేసీ పరిణామమే అవుతుంది. చూడాలి మరి జగన్ దీనికి విరుగుడుగా మరే హామీ ఇచ్చి ఆకట్టుకుంటారో. లేక ఈ హామీలు తనవేనని ఎలా క్లైం చేసుకుంటారో.


మరింత సమాచారం తెలుసుకోండి: