ఏపీ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి వచ్చే ఎన్నికలు చాలా  ప్రత్యేకమైనవి. ఏ మాత్రం అజాగ్రత్తతో ఉన్నా ఇబ్బందులు తప్పవు. అందువల్ల జగన్ ఆచీ తూచీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికైతే పాదయాత్ర పూర్తి అయింది రాబోయే రోజుల్లో రాజకీయంగా దూకుడు తో ముందుకు సాగాలని జగన్ డిసైడ్ అయినట్లుగా పార్టీ వర్గాల భోగట్టా.


సిట్టింగులు హ్యాపీ :


వైసీపీలో సిట్టింగులకు ఈ దఫా టికెట్లు ఖాయమన్న మాట వినిపిస్తోంది. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొని జగన్ మీద లాయల్టీ చూపిస్తూ పార్టీ కోసం పనిచేసిన సిట్టింగులకు మరో అవకాశం ఇవ్వాలని జగన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నార‌ని అంటున్నారు. వైసీపీకి నలభై ఆరు మంది వరకూ సిట్టింగు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటే ఒకరిద్దరిని ఎంపీగానే, మరే విధంగానే ఉపయోగించుకోవడం తప్పించి మొత్తానికి మొత్తంగా టికెట్లు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. ఈ న్యూస్ తో ఇపుడు ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలకు ఏసీలో ఉన్నట్లుగా ఉందంటున్నారు.


మాజీలకూ చాన్స్ :


ఇకపోతే పార్టీలోని మాజీ మంత్రులు, సీనియర్ల సేవలను కూడా జగన్ గుర్తించారని, వారికి కూడా ఈసారి టికెట్ల కేటాయింపులో పెద్ద పీట వేస్తారని అంటున్నారు. గత ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయినా ఇప్పటివరకూ పార్టీని కాపాడుకుంటూ వస్తున్న సీనియర్ నేతల పట్ల జగన్ కి పాజిటివ్ ఒపీనియన్ ఉందని అంటున్నారు. అలాగే వైసీపీలో మాజీ మంత్రులు కూడా ఎక్కువగా ఉన్నారు. వారి బలాలను కూడా వీలున్నంత వరకూ వాడుకోవాలని, టికెట్లు ఇవ్వాలని కూడా నిర్ణయించారని అంటున్నారు. దాంతో పార్టీలోని బొత్స‌ సత్యనారాయణ, పార్ధసారధి ధర్మాన ప్రసాదరావు  వంటి సీనియర్లు పోటీకి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.


వారికే డౌట్ :


పార్టీలో ఇంచార్జులుగా ఉంటూ ఏ మాత్రం పార్టీ గ్రాఫ్ ని పెంచలేని వారికి మాత్రం జగన్ షాక్ ఇస్తారని వారి స్థానంలో మాత్రం పార్టీలో మెరుగైన వారు ఉంటే టికెట్లు కేటాయించడం, లేకపోతే బయట నుంచి వచ్చే వారికి బలంగా ఉన్న వారికి చాన్స్ ఇవ్వడం జగన్ చేస్తారని అంటున్నారు. అంటే దాదాపు వందకు పైగా అసెంబ్లీ సీట్లలో వైసీపీకి గట్టి అభ్యర్ధులు ఉన్నట్లు లెక్క. వీరు కాకుండా మిగిలిన చోట్ల మాత్రమే ఉన్న వారిని మార్చడం, బయట పార్టీలకు తలుపులు తెరవడం జరుగుతుందని అంటున్నారు. ఈసారి అభ్యర్ధుల విషయంలో అంగ బలంతో పాటు, అర్ధబలం కూడా జగన్ పరిగణనలోకి తీసుకుంటున్నారని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే జగన్ పార్టీ అభ్యర్ధుల మొదటి జాబితా కూడా ఫిబ్రవరి లో వెలువడే అవకాశం ఉంటుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: