తెలంగాణ ఎన్నికల అయిపోయిన తరువాత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చంద్ర బాబు కు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని పదే, పదే చెప్పాడు. దీని గురించి అప్పుడు చంద్ర బాబు అండ్ టీం ఇస్తే ఇవ్వండి రిటర్న్ గిఫ్ట్ అంటూ వెటకారం చేశారు. కేసీఆర్ వచ్చి ఆంధ్రలో ఏం పొడుస్తాడు లే అని చాలా మంది అనుకున్నారు. అయితే ఇప్పడూ జగన్ - కేటీఆర్ భేటీ తో టీడీపీ కి దిమ్మ తిరిగిందని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. చంద్ర బాబు కు ఎంతలా ఆ భయం పట్టుకుందంటే దావోస్ పర్యటను కూడా రద్దు చేసుకునేటంతగా .

Image result for chandrababu naidu

 దీంతో సంక్రాంతి వేడుకలలో స్వగ్రామంలో ఉన్న చంద్రబాబు నాయుడు తన మొత్తం పర్యాటనను రద్దు చేసుకున్నారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేగంగా మారుతున్న పరిస్దితులను రాష్ట్రంలోనే ఉండి అంచన వేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర సమితి - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీల రాజకీయాలను ఎదుర్కునేందుకు పగడ్బంది వ్యూహ రచన చేసేందుకు దావోస్ వెళ్లేందుకు కూడా చంద్రబాబు వెనుకంజ వేసారని అంటున్నారు.

Image result for jagan ktr

వైఎస్ జగన్ మోహాన రెడ్డి - కె.తారక రామారావుల సమావేశం అనంతరం తెలుగుదేశం పార్టీలో ఓఆందోళన ప్రారంభమయ్యిందని దానికి తార్కానమే చంద్రబాబు నాయుడి దావోస్ పర్యాటన రద్దు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దావోస్ పర్యాలటనలో తనకు బదులుగా తన కుమారుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు అంటున్నారు. ఇది ఒక విధంగా తన వారసత్వాన్ని ముందుకు తీసుకుని రావడమే అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ విధంగా చంద్ర బాబు కు మొదటి దెబ్బ పడిందని అందరూ విశ్లేషి స్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: