వైసీపీ అధినేత జగన్ ఉండేది ఎపుడూ పోరాటాల పేరు మీద రోడ్డు మీదనే. ఆయనకు ఎన్ని ఇళ్ళు ఉన్నా ప్రజా సేవలో ఎక్కువ టైమ్ గడిపేది మాత్రం జనంలోనే.  ఇక పోతే,   హైదరాబాదు తో లోటస్ పాండ్ పేరిట పెద్ద భవనం ఉంది. ఇక బెంగుళూర్ లో కూడా ప్యాలస్ ఉంది. మరి ఇపుడు ఆయన కొత్త ఇల్లొకటి కట్టిస్తున్నారు. ఆ కధా కమామీషూ చాలనే ఉందంటున్నారు.


ఇద్రభవనమట :


జగన్ అమరావతికి మకాం మార్చేస్తున్నారు. దాని కోసం ఆయన కొత్త ఇల్లు కడుతున్నారు.  కృష్ణానది ఒడ్డున తాడేపల్లి ప్రాంతంలో రెండు నుంచి ఐదెకరాల స్థలంలో ఇంటి నిర్మాణం ఇపుడు శరవేగంగా జరుగుతోంది. ఈ ఇంటి పనులు ఇపుడు చివరి దశకు చేరుకున్నాయి. ఈ కొత్త ఇల్లు ఎలా ఉంటుందన్నది ఇపుడు అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. అక్కడ కడుతున్న తీరు, భవన నిర్మాణం వంటివి చూసిన వారంతా ఇంద్రభవనం అంటున్నారు. కొత్త ఇంటిని సువిశాలంగా జగన్ నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుఇలోనే ఇల్లు, ఆఫీస్ కూడా ఉండేలా చూసుకుంటున్నారు. అలాగే చాలా గదులు కూడా కొత్త ఇంట్లో ఉన్నాయని అంటున్నారు.


వచ్చే నెలలో :


ఇక జగన్ తన మకాం వచ్చే నెలలో మార్చేస్తున్నారు ఫిబ్రవరి 14న ఆయన కొత్త ఇంటికి గ్రుహప్రవేశం కానున్నారు. దీని కోసం ముఖ్య అతిధిగా కేసీయార్ ని పిలవనున్నారు. ఇక ఇంటికి సంబంధించి స్థానికులు దాన్ని  చూస్తూ కధలు కధలుగా చెప్పుకుంటున్నారు. మరి ఈ కొత్త ఇంట్లో జగన్ అడుగు పెట్టిన వేళా విశేషం ఆయనకు లక్ తగిలితే ముఖ్యమంత్రి పీఠం కూడా అందివస్తుంది. అపుడు ఉండవల్లిలోని సీఎం అధికారిక నివాసంలోకి మారుతారు. మొత్తానికి ఎలా చూసుకున్నా జగన్ ఇల్లు అన్నది ఇపుడు పెద్ద టాపిక్ గా మరింది.



మరింత సమాచారం తెలుసుకోండి: