ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజున ఆ దేశం గణతంత్ర దేశంగా ప్రకటించుకుని, జరుపుకునే జాతీయ దినోత్సవమే 'రిపబ్లిక్‌ డే'. భారతదేశంలో మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన 26 జనవరి 1950 ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.  ఈ రోజున బ్రిటీషు కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయిపోయి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పాటైంది. అనేక సవరణల అనంతరం, 1949 నవంబర్‌ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించింది.
Related image
భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలం పట్టింది. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తించబడింది. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.  ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం వేడుకలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈసారి గణతంత్ర దినోత్సవానికి సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ముఖ్యఅతిథిగా రానున్నారు. వివిధ రాష్ట్రాల శకటాలు రెడీ అవుతున్నాయి. రిహార్సల్స్ కూడా మొదలెట్టేశారు. 
Related image
-జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది గణతంత్ర వేడుకలను ఘనంగా జరుగనున్నాయి. గాంధీని స్మరిస్తూ..ఆయన జీవితాన్ని ప్రతిబించేలా శకటాలు తయారు చేయాలని ఆయా రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. 
-జనవరి 22 వ తేదీ ఉదయం 6గంటల నుండి రాజ్‌పథ్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
- జనవరి 23వ తేదీన బుధవారం రాజ్ పథ్ వద్ద రిహార్సల్స్ జరుగనున్నాయి. విజయ్ చౌక్ వద్ద ఉదయం 9.50కి ఇవి జరిగాయి.
- ఇండియా గేట్ జనవరి 23వ తేదీన ఉదయం 9గంటలకు క్లోజ్ చేయనున్నారు. 

Image result for mahatma gandhi

- రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ‘నేషనల్ వార్ మెమోరీయల్’ను ఆవిష్కరించనున్నారు. దేశం కోసం వీరమరణం పొందిన జవాన్ల సేవలను స్మరించుకోవాలని దీనిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐఏఎఫ్ మూడు హెలికాప్టర్‌లతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 
-ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బయో ఇంధనంతో ఉన్న విమానాలు ఆకాశంలో చక్కర్లు కొట్టనున్నాయి. రాజ్ పథ్‌లో ‘వి’ ఆకారంలో విమానాలు తిరగనున్నాయి. 
-రిపబ్లిక్ డే సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకలు జరిగే ప్రాంతంలో 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 
-ఐఏఎఫ్ కూడా ఈ సంవత్సరం ప్రత్యేక శకటాన్ని తయారు చేసింది. మొట్టమొదటగా మహిళా ఆఫీసర్ ఆర్మీ సర్వీసెస్ ప్రాతినిధ్యం వహించనున్నారు. డేర్ డెవిల్స్ మోటార్ సైకిల్ టీం కూడా పాల్గొననుంది. 
-ఇక రిపబ్లిక్ డే వేడుకల్లో మిలటరీకి చెందిన వాహనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. కే9 వజ్రతో పాటు T-90 ట్యాంక్స్, SU-30, Mig 29 హైలెట్‌గా ఉండనున్నాయి. 
-రిపబ్లిక్ 2019 పరేడ్ టికెట్స్ జనవరి 7వ తేదీ నుండి విక్రయిస్తున్నారు. ఈ టికెట్లు జనవరి 25 వరకు విక్రయించనున్నారు. బీటింగ్ రీట్రిట్‌కు సంబంధించిన టికెట్లను జనవరి 27-28వ తేదీల్లో విక్రయించనున్నారు. 
-రాజ్ పథ్ వద్ద జిరగే పరేడ్‌లో జాతీయ ధైర్య సాహసాలు అవార్డులు పొందిన వారు కూడా పాల్గొనున్నారు. ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ పొందిన గ్రహీత కూడా పాల్గొనున్నారు. 





మరింత సమాచారం తెలుసుకోండి: