ఆగస్ట్ 15 స్వంత్రంత్ర్య దినోత్సవం.. జనవరి 26న రిపబ్లిక్ డే ప్రతి ఏడాది జరుపుకుంటాం.. ఆగస్ట్ 15న అంటే.. ఆ రోజు దేశానికి స్వంతంత్ర్యం వచ్చిన రోజు.. ఆంగ్లేయులు దేశం విడిచి వెళ్లిన రోజు.. కానీ జనవరి 26 ఏంటి.. ఆ రోజే ఎందుకు రిపబ్లిక్ డే జరుపుకుంటాం.. ఓసారి చూద్దాం.

january 26 కోసం చిత్ర ఫలితం


జనవరి 26, 1950లో మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. అందుకే రిపబ్లిక్‌ డే జరుపుకుంటాం.. కానీ రాజ్యాంగం జనవరి 26నే ఎందుకు అమల్లోకి వచ్చింది. ఆ రోజు ప్రత్యేకత ఏంటి.. దేశానికి ఆగస్టు 15, 1947నే స్వాతంత్ర్యం వచ్చినా మనకంటూ ఓ రాజ్యాంగం లేదు.

january 26 కోసం చిత్ర ఫలితం


ఆ లోటు భర్తీ చేసుకునేందుకు కొన్నాళ్ల ముందుగానే రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. 1947 ఆగస్టు 29న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటైంది. అప్పటి నుంచి అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యంగ రచనకు చాలా కసరత్తు జరిగింది.

india constitution images కోసం చిత్ర ఫలితం


అలా తయారైన రాజ్యాంగాన్ని అనేక సవరణల తర్వాత రాజ్యాంగ పరిషత్త 1949 నవంబరు 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. మరి అది జనవరి 26 నుంచే ఎందుకు అమల్లోకి వచ్చిందంటారా.. 1930 జనవరి 26న అఖిల భారత కాంగ్రెస్‌ పూర్ణ స్వరాజ్‌ దినంగా పాటించింది. ఆ స్ఫూర్తితో జనవరి 26, 1950 నుంచే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: