నా ఛానెల్ నా ఇష్టం అంటూ ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు రెచ్చిపోతున్నారు. తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను ఆయన తన రాజకీయ అస్త్రంగా మలచుకున్నారు. రోజుకో వీడియో పోస్టు చేస్తూ పొలిటికల్ హీట్ రైజ్ చేస్తున్నారు.

nagababu vs jagan కోసం చిత్ర ఫలితం

నాఛానెల్ నా ఇష్టం అంటూ రెండు రోజులు ఏపీ మంత్రి నారా లోకేశ్ ను ఆడుకున్న నాగబాబు ఇప్పుడు జగన్ పై దృష్టి సారించారు. జగన్ గతంలో అన్న కామెంట్లను కోట్ చేస్తూ ఆయనో అవినీతిపరుడు అంటూ చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

nagababu vs jagan కోసం చిత్ర ఫలితం

జగన్ గతంలో ఓ మీటింగ్ లో అన్నట్టుగా ఉన్న వీడియోను కూడా నాగబాబు తన వీడియోకు జత చేశాడు. మీరు ఎన్నికల్లో బాగా డబ్బు ఖర్చు పెట్టండి. మీరు నష్టపోయినా ఫరవాలేదు.ఒక్క రెండు సంవత్సరాలు ఆగండి.. అందుకు నాలుగింతలు సంపాదించుకునే అవకాశం నేను కల్పిస్తాను.. అంటూ జగన్ తన పార్టీ నేతలకు చెబుతున్న వీడియోను నాగబాబు చూపించారు.

nagababu vs jagan కోసం చిత్ర ఫలితం

ఈ విధంగా కోట్లకు కోట్లు ఖర్చు పెట్టండి.. అధికారంలోకి రాగానే సంపాదించుకుందాం అనే నేత ప్రజలకు ఏం సేవ చేస్తాడని నాగబాబు ప్రశ్నిస్తున్నారు. జగన్ అధికారంలోకి వస్తే ఆ వీడియోలో చెప్పినట్టుగా వైసీపీ నాయకులు ఏపీ రాష్ట్రాన్ని బిర్యానీలా పంచుకుని తినేస్తారని విమర్శించాడు నాగబాబు.


మరింత సమాచారం తెలుసుకోండి: