గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పద్మ అవార్డుల జాబితాను ప్రకటించింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సోదరి, ప్రముఖ రచయిత్రి అయిన గీతా మెహతా కూడా ఈ జాబితాలో ఉన్నారు.  అయితే అవార్డు ప్రకటనపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వం తనకు అందివ్వాలనుకుంటున్న ఈ అవార్డును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. న్యూయార్క్‌లో ఉంటున్న ఆమె దీనికి సంబంధించి ఓ ప్రెస్‌ స్టేట్‌మెంట్‌ను విడుదల చేశారు. 


'పద్మశ్రీ అవార్డుతో నన్ను గుర్తించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అయితే సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో అవార్డు తీసుకోవడం సరికాదని భావించి నిరాకరిస్తున్నాను. అవార్డు కారణంగా అటు ప్రభుత్వానికి, ఇటు తనకు ఇబ్బంది తలెత్తకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అవార్డును నిరాకరిస్తున్నందుకు విచారం తెలియజేస్తున్నాను' అని ఆ ప్రకటనలో గీతా మెహతా తెలిపారు.  ఈ సమయంలో తాను అవార్డు తీసుకోవడం సముచితం కాదని, అందుకే తిరస్కరిస్తున్నానని తెలిపారు.

Image result for రచయిత్రి గీతా మెహతా

ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలోని ఎంపీ సీట్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. రాష్ట్రంలో ఇటు బీజేపీ, బీజేడీకు గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఇటీవల మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్నాయక్‌‌ పై విరుచుకుపడటం, ఒడిశాలో పాగా వేయాలని బీజేపీ పట్టుదలగా ఉండటం తెలిసిందే. బీజేడీ మద్దతు కోసమే మోదీ సర్కార్ వ్యూహాత్మకంగా గీతమెహతాకు అవార్డు అందించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడామె పద్మశ్రీని తిరస్కరించడంతో నమో సర్కార్ సందిగ్ధంలో పడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: