తమ కష్టాలు విన్నివించుకునేందుకు వచ్చిన ఓ మహిళ చున్నీ పట్టి అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే సిద్దరామయ్యకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  సమస్యలు చెప్పకోవడానికి వచ్చిన మహిళ పట్ల మాజీ సీఎం సిద్దరామయ్య సహనం కోల్పోయారు..ఆమెపై నోరు పరేసుకున్నారు..అంతటితో ఆగలేదు ఆమె చున్నీ పట్టి లాగారు.

సిద్దరామయ్య కుమారుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గంలో పర్యటించిన మాజీ సీఎం సిద్దరామయ్య ఓ కార్యక్రమంలో హాజరయ్యారు.  జమాలర్ అనే స్థానిక మహిళ సిద్దరామయ్య ముందు స్థానిక సమస్యలు ఏకరువు పెట్టుకున్నారు. మీ కుమారుడు నియోజకవర్గంలో ఇప్పటి వరుకు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని ఆమె అనడంతో సిద్దరామయ్య ఒక్కసారే కోపంతో ఊగిపోయారు.


నన్నే నిలదీస్తావా అంటూ ఆవేశపడ్డారు..గట్టిగా కేకలు వేయడమే కాదు..ఆమె చున్నీని కూడా లాగేశారు. మొదట అక్కడ ఉన్న నాయకులు ఈ విషయంలో ఆమె పై సీరియస్ అయ్యారు..తర్వాత ఆమెకు సర్థి చెప్పారు.  ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: