ప్రస్తుతం ఈ అంశం అమరావతిని హీటెక్కిస్తోంది. చాలాకాలానికి మాజీ మిత్రుడు పవన్, చంద్రబాబు ఒకే వేదికపైకి వస్తారన్నది ఆ ప్రచారం సారాంశం. దానికి సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయట. మరి ఈ విషయంలో టీడీపీ హడావుడి ఎక్కువగా ఉంది. వారి వైఖరి చూస్తూంటే ఇద్దరు నేతలు ఒకే ఫొటోకు చిక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


అఖిలపక్షం పేరిట:


ఇంతకీ విశేషం ఏంటంటే ప్రత్యేక హోదా సాధన కోసం సాధన సమితి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1న ఏపీ బంద్ కి పిలుపు ఇచ్చారు. దానికి  ముందుగా ఈ నెల 30న అఖిలపక్షం పేరిట ఒక మీటింగు పెడుతున్నారుట. ఈ మీటింగ్ ఆలోచనా అచ్చంగా  టీడీపీ వారిదే. దీనిని సంబంధించి అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపారట. దీనికి సంధానకర్తగా చలసాని శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. పేరుకు ఆయన అయినా తెరవెనక టీడీపీ పెద్దలే దీనికి పూనుకున్నారని అంటున్నారు. ఎవరిని పిలవాలి. ఎలా పిలవాలి అన్నది కూడా వాళ్ళే చూస్తున్నారట.


పవన్ తో మంతనాలు :


ఇక ఈ మీటింగుకు రావాలంటూ పవన్ తో టీడీపీ నేఅలు మంతనాలు సాగించార‌ని కూడా ప్రచారం సాగుతోంది. మరి ఇంత శ్రద్ధగా వైసీపీని పిలిచారా అంటే అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. పైగా వైసీపీ రాకూడదని, హోదా పోరాటం క్రెడిట్ తామే కొట్టేయాలని టీడీపీ ఆరాటపడుతోంది. ఈ నేపధ్యంలో వైసీపీ వూసు లేకుండానే అఖిలపక్షం సమావేశం అన్నమాట. వామపక్షాలు, పవన్, కాంగ్రెస్ ఇలా కొన్ని పార్టీలను పిలిచి వైసీపీ, బీజేపీలను పక్కన పెట్టి అఖిలపక్షం సమావేశం అంటూ హడావుడి చేయబోతున్నారని అంటున్నారు. ఇది తెర ముందుకధ.


ఆయన వస్తారా :


ఇక అసలు కధ తెర వెనక ఉంది. ఈ మీటింగుకు పవన్  హాజరైతే చంద్రబాబు తో ఆయన కలసి ఉన్నట్లుగా చూపించుకోవాలని, నింపాదిగా దాన్ని మరో ఎపిసోడ్ లో మేమంతా ఒక్కటేనని ప్రచారం చేసుకోవాలని టీడీపీ వ్యూహకర్తల ఆలొచన. పనిలో పనిగా టీజీ వెంకటేష్ చెప్పినట్లు ఒకే ఆశయాలు ఉన్న పార్టీలు ఎందుకు కలవకూడదు అన్న పాయింటులో పవన్ని చేరదీసేందుకు కూడా ఈ మీటింగు ఒక అవకాశంగా కూడా టాక్ నడుస్తోంది. మరి పవన్ ఈసారి టీడీపీ వేసే కొత్త స్కెచ్ కి దూరంగా ఉంటారా. లేక అఖిలపక్షానికి హాజరై టీడీపీ ప్రచారానిక్ ఊతమిస్తారా అన్నది చూడాలి. పవన్ తన పార్టీ ప్రతినిధులను పంపి ఊరుకుంటే మాత్రం టీడీపీ కొత్త వ్యూహాలు బెడిసినట్లేనని భావించాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: