లగటిపాటి రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఒక సంచలనం అని చెప్పాలి. అయితే లగటిపాటి ఎన్నికల ముందు టీడీపీ లోకి వస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఊహాగానాలు ఊపందుకున్నాయి.  తెలంగాణలో ఘోరాతి ఘోరంగా ఓడిన టీడీపీ... ఇప్పుడు ఏపీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో చాలా చోట్ల ఆ పార్టీకి దిమ్మతిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొందరు నేతలు పార్టీలోకి వస్తున్నా... కొందరు నేతలు ఝలక్కిస్తూ పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో పార్టీలోకి ఎవరు వచ్చినా వద్దనే పరిస్థితి లేదన్నది టీడీపీ మాటగా వినిపిస్తోంది.

Image result for lagadapati rajagopal

ఈ నేపథ్యంలోనే ఇదే మంచి అవకాశమని భావించిన లగడపాటి మళ్లీ రాజకీయాల్లోకి పునఃప్రవేశించాలని  - అది కూడా టీడీపీ ద్వారానే తన రీ ఎంట్రీ ఉండాలని భావిస్తున్నారు. అందుకు పకడ్బందీ ప్రణాళిక రచించుకున్న లగడపాటి... మొన్నామధ్య ఉండవల్లికి వెళ్లి టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. ఆ తర్వాత తన ఇంటిలో జరిగిన ఓ వేడుకకు కూడా చంద్రబాబును రప్పించుకోగలిగారు. ఈ వేడుక అయ్యిందో - లేదో... వెంటనే మళ్లీ బాబు వద్దకు పరుగులు పెట్టారు.ఈ సారి బహిరంగంగా కాదు. చాలా రహస్యంగా జరిగిన ఈ భేటీకి లగడపాటి తన వెంట బాబు వద్దకు ఓ మీడియా పెద్దను కూడా తీసుకెళ్లారు.


గంటల తరబడి చర్చించుకున్నా... ఆ సారాంశమేమిటో బయటకు రాలేదు. అయితే ఈ విషయంలో ఇరువర్గాలు బయటపడకున్నా.. లగడపాటి రాజకీయ పునఃప్రవేశం దిశగానే అడుగులు వేస్తున్నారని విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో తన సర్వేలతో టీడీపీ పరువు తీసేసిన లగడపాటిని చంద్రబాబు తన పార్టీలోకి చేర్చుకుంటారా? అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా వినిపిస్తోంది. ఇదే డౌటు వచ్చిన లగడపాటి కూడా చంద్రబాబు నుంచి నో అనే స్పందన రాకుండా చూసేందుకే తన వెంట ఓ మీడియా పెద్దను తీసుకెళ్లారని పుకార్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: