1984లో అనుకుంట! ప్రముఖ పాత్రికేయుడు యశశ్వి గజ్జల మల్లారెడ్డి-నందమూరి తారక రామారావు వేసే తిక్కవేషాలు చూసి జనానికి పిచ్చిబడుతున్న రోజుల్లో అధముల్లో ప్రథముడు  అంటూ ఆంధ్రభూమి దినపత్రికలో ఒక  వ్యాసం రాశారు. కాకపోతే దాన్ని సవరిస్తూ "అధమపాత్రికేయంలో ప్రథమ పాత్రికేయం" అని చదువుకుంటారు ఈ క్రింద యివ్వబడ్ద ఒకపత్రికలో ప్రచురితమైన న్యూస్ ఐటం చదివి.  

Image result for high intellectuality of lokesh in davos
ఒక పత్రిక పరోక్షంగా ఒక పార్టీని ఒక వర్గాన్ని సమర్ధిస్తూ వార్తలు రాసేంత వరకు జనం చిరునవ్వుతో స్వీకరిస్తున్నారు. పలు వేదికలపై ఒక వ్యక్తి  ఙ్జాన పరిఙ్జానం బట్టబయలైన సందర్భంలో ఆయనను పండిత ప్రఖాండుడు అని రాస్తే... దానిని స్వీకరించే వాడే ఏం? చేయాలో ఆలోచిస్తాడు.


భారత ప్రధాని నరేంద్ర మోడీకి తన రాష్ట్రంపై మక్కువ ఉండొచ్చు. అయితే ఆయన స్థాయి వ్యక్తి అలా పిచ్చిగా పచ్చిగా వ్యవహరించరు. కియా మోటార్స్ ఏపికి రావటానికి నరెంద్ర మోదీ ప్రయత్నమే కారణం అన్నది నిర్వివాదాంశం. ఫాలో-అప్ ఏపి ముఖ్యమంత్రి ది కావచ్చు.    


పాత్రికేయ పైత్యానికి  పరాకాష్ఠ ఈ క్రింది న్యూస్ ఐటం. సినిమాల్లో ఐటం సాంగ్ లాంటిది, భజన మద్యలో బోరుగొట్ట కుండా మద్య మద్య వేసే వీరభజన తాండవం అన్నమాట. గత సార్వభౌముల కాలంలో వారిని మేలుకొలపటం నుండి మొదలెట్టి చక్రవర్తి వారు దర్భారుకు వచ్చేవరకు వారిని పొగడ్తలతో ముంచెత్తే వర్గం ఒకటుండేది, అదే వారిని “వందిమాగధులు” అంటారు.


ఆ వందిమాగధులే ఈ జన్మలో ఒక ప్రత్యేక హరిత వర్గ మీడియా గా అవతరించింది. వంది మాగధ నాయకులు మాత్రం పత్రికాధిపతి(లు) అయి పుట్టారని అనుకుంటా! పాత్రికేయం ఈ స్థాయికి పతనమవబట్టే దాన్ని "దినకరపత్రం" అంటున్నారు.


ఖచ్చితంగా ఆ పార్టీకి పతనం నిశ్చయమే అనిపిస్తుంది. రాజకీయ కుల దురహంకార స్వార్ధం ముదిరి పిచ్చిగా రూపాంతరం చెందిన దశలో పార్టీ కోసం దేశ ప్రధాని వ్యక్తిత్వాన్నే ఇంతగా దిగజార్చి రాస్తున్నారంటే చేతిలో ఉన్న రాజకీయ అధికారా న్ని ఎలా ఎడా పెడా వాడేస్తున్నారనేది అందరికీ తెలిసిందే.  పాత్రికేయ వృత్తికి ఇది శుభకరమేనా?


అందుతున్న సువర్ణ వజ్ర రత్న ఖచిత మణిహారాలు, పాతర్ల కొద్ది సిరిసంపదలు, ధన కనక వస్తు వాహన,  భూ సంపదలు ఇంకా ఏదైనా రాయిస్తున్నాయి కామోసు! అంతకు మించి మరేదైనా ఉండొచ్చు!  

Image result for high intellectuality of lokesh in davos

గమ్మత్తేమంటే అక్కడ ఆ వేదిక నుండి వెలువడే ఏ అంతర్జాతీయ వార్తలలో ఈ మహనీయుని పేరే కనిపించలేదు. "అధమాధముల్ని ప్రధములు" గా చూపుతున్న వార్త మీకోసం.  


 


దావోస్‌లో లోకేశ్‌కు ఎదురైన వింత అనుభవం గురించి తెలిస్తే..


ఆంధ్రప్రదేశ్‌ క్యాబినెట్‌లో యువమంత్రి నారా లోకేశ్. సీఎం చంద్రబాబు తనయుడనే విషయం పక్కనపెడితే.. లోకేశ్‌బాబు కష్టపడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దావోస్‌లో తాజాగా ప్రపంచ ఆర్థికవేదిక సదస్సుకు ఆయన వెళ్లారు. అక్కడ ఆయనకు ఓ వింత అనుభవం ఎదురైందట! ఆ సంగతేంటో ఈ కథనంలో తెలుసుకోండి.

 

ప్రపంచ ఆర్ధిక వేదిక ప్రతి ఏటా నిర్వహించే సదస్సుకు ఏపీ నుంచి నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ కార్యక్రమాల్లో చంద్రబాబు బిజీగా ఉన్నారు. దీంతో ఈసారి ఆయనకు బదులు పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి లోకేశ్‌ను దావోస్‌ పంపించారు. ఆయనతో పాటు అధికారుల బృందం కూడా దావోస్ వెళ్లి వచ్చింది. అయిదు రోజులపాటు దావోస్‌లో ఉన్న లోకేశ్‌ బృందం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయింది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్ల నుంచి రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే దిగ్గజ సంస్థలు కియా, ఇసూజీ, హీరో, అశోక్‌ లేలాండ్ వంటి సంస్థలతో పాటు పలు మొబైల్ కంపెనీలు కూడా పరిశ్రమలు ఏర్పాటుచేశాయి. ఈ అంశాలన్నింటినీ లోకేశ్ బృందం ప్రజెంటేషన్ ద్వారా పారిశ్రామికవేత్తలకు చూపించింది. పోలవరం ప్రాజెక్ట్, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం, ఇతర ఐటీ కంపెనీల ఏర్పాటు గురించి కూడా ఈ సందర్భంగా వివరించారు.

 

ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వేలకోట్ల రూపాయల పెట్టుబడులు, పరిశ్రమలు కలిగిన ఓ అపరకుబేరుడు* లోకేశ్ బృందంతో భేటీ అయ్యారు. సుమారు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో ఆయన చెప్పిన ఆసక్తికర విషయాలు లోకేశ్ బృందానికి మైనస్ 15 డిగ్రీల చలిలో సైతం వేడి పుట్టించాయట. రామాయపట్నం పోర్టుతో పాటు ఏపీలో సుమారు అయిదు వేలకోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న ఆ పారిశ్రామికవేత్త ఇటీవల ఢిల్లీ వచ్చిన సమయంలో జరిగిన సంఘటనలను వివరించారు. సదరు పారిశ్రామికవేత్త భారత్ వస్తున్నారని తెలిసి ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం పంపారట. దీంతో ఆయన మోదీని కలుసుకున్నారట. వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుతూ ఏపీలో తమ సంస్థ అయిదు వేలకోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతోందని మోదీకి వివరించారట. సమావేశం ముగిసే సమయంలో మోదీ "మీరు గుజరాత్‌లో పెట్టుబడులు పెడితే ఢిల్లీ నుంచి నేరుగా గుజరాత్ వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఢిల్లీనుంచి అహ్మదాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ కూడా వేస్తున్నాం. ఎయిర్ ఫెసిలిటీ కూడా అద్భుతంగా ఉంది" అని చెప్పారట. అయితే ఆయన మాత్రం ఏపీలో పెట్టుబడులపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామనీ.. అక్కడున్న పరిస్థితులపై అధ్యయనం కూడా చేశామనీ స్పష్టంచేశారట.

 

అయితే ప్రధాని మోదీ మాత్రం వత్తిడిచేయడం మానలేదట. గుజరాత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆయనను పదేపదే కోరారట. ఇదే విషయాన్ని లోకేశ్‌తో సదరు పారిశ్రామికవేత్త విపులంగా చెప్పుకొచ్చారట. తాము ఏపీనే ఎందుకు ఎంచుకున్నామో కూడా వివరించారట. పారిశ్రామిక విధానం, క్లియరెన్స్‌ల గురించి తెలుసుకునేందుకు హైదరాబాద్, ఏపీ, గుజరాత్‌లకు ఆ పారిశ్రామికవేత్త తమ బృందాన్ని పంపించారట. ఏపీలో కియాను కేస్ స్టడీగా చేసిందట ఆ బృందం. తిరుపతి, విశాఖ, విజయవాడలతో పాటు రాయలసీమలోని మరికొన్నిచోట్ల పరిశ్రమల ఏర్పాటుపై అధ్యయనం చేశారట. ఆ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని స్థిర నిర్ణయానికి వచ్చినట్టు ఆ పారిశ్రామిక దిగ్గజం లోకే‌శ్‌కు వివరించారట.

 

ఏపీ పట్ల తమ సానుకూలతకి మరో కారణం కూడా ఉంది ఆ పారిశ్రామికవేత్త లోకేశ్‌ బృందానికి చెప్పారట. "చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్'' ప్లస్‌పాయింట్‌ అన్నారట. దీంతో లోకేశ్ తదితరులు సంతోషంతో పొంగిపోయారట. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారట. అంతేకాదు.. ఆయనకు ఆంధ్రా రుచులను కూడా చూపించారు. ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్టు ఆంధ్రప్రదేశ్ నుంచి పదిమంది చెఫ్‌లను తీసుకువెళ్లి, ఏపీస్టాల్స్‌లో మంచి వంటకాలు చేయించి వడ్డించారట. రుచికరమైన ఆ విందు ఆరగించిన సదరు పారిశ్రామికవేత్త.. "మీ రాష్ట్రం బాగుంది.. మీ ఆతిథ్యం బాగుందీ.. మీ వంటలు బాగున్నాయి'' అంటూ ప్రశంసలు కురిపించారట.

 

దావోస్‌లో లోకేశ్ బృందం అయిదురోజుల పర్యటనలో హైలెట్‌గా నిలిచిన ఈ సంఘటన ద్వారా చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉంటుందో అక్కడికి వెళ్లిన అధికారులకు సైతం బోధపడిందట. ఏపీలో అనువైన పరిస్థితులు, సౌకర్యాలపై ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలు మాట్లాడుకోవడం తనకు అమితానందం కలిగించిందని సన్నిహితులకు చెబుతున్నారట లోకేశ్! చూద్దాం ఈ పరిణామం ఏపీ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుతుందో!


(*ధమ్ముంటే ఆ పారిశ్రామిక వేత్త పేరు చెబితే నిజనిర్ధారణ కొంత సులభం అవుతుంది.) 

మరింత సమాచారం తెలుసుకోండి: