ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటిస్తూ అటు ప్రజల లోనూ ఇటు పార్టీలోనూ నమ్మకాన్ని కనబరుస్తున్నారు. త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రకటిస్తున్న హామీలు ప్రత్యర్థి పార్టీల గుండెల్లో భయాన్ని సృష్టిస్తున్నాయని చాలామంది టిడిపికి చెందిన నేతలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా విభజన తో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు అనుభవం వల్ల ప్రజలు బాధలు పడకుండా విభజనతో నష్టపోయిన భారం ప్రజలపై పడకుండా అద్భుతంగా పరిపాలిస్తున్నారు అని మరికొంతమంది టీడీపీకి చెందిన నాయకులు కామెంట్లు చేస్తున్నారు.

Image result for chandrababu

ఈ నేపథ్యంలో ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో  మూడు రోజుల పాటు పెన్షన్లు, డ్వాక్రా, మెప్మా మహిళలకు పసుపు కుంకుమ నగదు పంపిణీ చేయబోతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది పెన్షన్‌ లబ్ధిదారులకు రూ.150 కోట్లు నగదు అందజేయడానికి క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు.

Image result for chandrababu

బ్యాంకర్లతో చర్చించి నగదు సిద్ధం చేశారు. లబ్ధిదారులకు రూ.3వేల చొప్పున పంపిణీ చేయడానికి రూ.2వేల నోటు ఒకటి, రూ.500 నోట్లు రెం డు ఇచ్చే విధంగా బ్యాంకర్లు నగదును ఎం పీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లకు అందజేశారు.

Image result for chandrababu

గ్రామ, మండల, మున్సిపల్‌, నగరపాలక సంస్థ పరిధిలో మూడు బృందాలు మూడు రోజుల పాటు వీటిని పంపిణీ చేస్తాయి. మొత్తంమీద ఎన్నికల ముందు ప్రజలకు పెన్షన్లు ఇచ్చే విషయంలో చంద్రబాబు చాలా శ్రద్ధగా ఉంటున్నారని ఎక్కడ ఏ విధమైన పొరపాటు లేకుండా చూసుకుంటున్నారని పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: