చంద్ర బాబు 2019 ఎన్నికలు దగ్గర ఉండటం తో పెన్షన్ ను రెండు వేలకు పెంచిన సంగతి తెలిసిందే. దీనితో ఈ పథకాన్ని టీడీపీ ప్రచారంగా బాగా వాడుకున్నది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా, తిరుపతి శంఖారావ సభలో జగన్ వృద్ధులకు పింఛన్ విషయంలో కీలక ప్రకటన చేశారు. వారికి నెలకు రూ.3వేల వృద్ధాప్య పింఛన్ ఇస్తామని చెప్పారు. నవరత్నాల్లో భాగంగా వృద్ధాప్య పింఛన్ రూ.2వేలు ఇస్తామని జగన్ గతంలో ప్రకటించారు. పింఛన్ల వయస్సును 65 నుంచి అరవయ్యేళ్లకు తగ్గిస్తామన్నారు. 

చంద్రబాబుకు దెబ్బకు దెబ్బ

వికలాంగులకు పింఛన్‌ను రూ.3వేలు చేస్తామని జగన్ వనరత్నాల్లో భాగంగా ప్రకటించారు. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైయస్సార్ చేయూత కింద మొదటి ఏడాది తర్వాత దశలవారీగా రూ.75వేలు ఆయా కార్పోరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఇందులో నవరత్నాల్లోని వృద్ధాప్య పింఛనును టీడీపీ కాపీ కొట్టిందని, అందుకే రూ.1000 నుంచి రూ.2 వేలు చేసిందని వైసీపీ విమర్శించింది.

Image result for jagan

దీంతో ఇప్పుడు జగన్ దెబ్బకు దెబ్బ అన్నట్లుగా మరో రూ.వెయ్యి పెంచి రూ.3వేలు ఇస్తానని ప్రకటించారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ దానిని రూ.3వేలు చేయలేని పరిస్థితి. ఎందుకంటే మళ్లీ పెంచలేరు. అలాంటి ప్రకటన చేసినా కాపీ చేస్తున్నారనే విమర్శలు తీవ్రమవుతాయి. దీంతో ఇదీ జగన్ దెబ్బ అంటే అని వైసీపీ కార్యకర్తలు సంబరపడిపోతున్నారు. ఇక, పొత్తుల విషయంలోను పదేపదే క్లారిటీ ఇస్తున్నారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఉందని అధికార తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆడినట్లుగా జగన్ ఆడుతున్నారని చెప్పింది. అలాగే జనసేనతో పొత్తుకు అవకాశాలున్నాయని కూడా ప్రచారం సాగింది. ఈ ప్రచారం నేపథ్యంలో తాము ఒంటరిగా పోటీ చేస్తామని పునరుద్ఘాటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: